Tamilsai : అమిత్ షా సీరియస్ వార్నింగ్‌.. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చిన తమిళిసై సౌందరరాజన్

లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను..

Amit shah Serious Warning to Tamilisai : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, గడ్కరీతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ కూడా పాల్గొన్నారు. తమిళిసై వేదికపైకి రాగానే అక్కడ ఆశీనులైన వారికి నమస్కారాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో తమిళిసై అమిత్ షా, వెంకయ్య నాయుడులకు కూడా నమస్కారాలు చేయగా.. అమిత్ షా ఆమెను దగ్గరకు పిలిచి సిరియస్ గా ఏదో మాట్లాడినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : Modi Tadasana : ప్రధాని మోదీ ‘తాడాసనం’ వీడియో చూశారా.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా?

తమిళిసైతో అమిత్ షా సీరియస్ గా మాట్లాడుతున్నవీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక ప్రశ్నలను లేవనెత్తారు. ఇటీవల తమిళనాడు బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై, తమిళిసై సౌందరరాజన్ మద్దతుదారుల మధ్య జరిగిన అంతర్గత పోరుతో ఈ సంఘటనతో పలువురు ముడిపెట్టారు. ఈ వీడియోపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై కూడా స్పందించారు. ప్రముఖ మహిళా రాజకీయవేత్తను ఇలా బహిరంగంగా మందలించడం ఏం మర్యాద? ఇది అందరూ చూస్తారని అమిత్ షా తెలుసుకోవాలని హితువు పలికారు. అమిత్ షా, తమిళిసై సంభాషణకు సంబంధించిన వీడియోపై తమిళనాడు రాజకీయాల్లో చర్చ రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో తమిళిసై ఎక్స్ వేదికగా స్పందించారు. అమిత్ షా, తనకు మధ్య జరిగిన సంభాషణపై క్లారిటీ ఇచ్చారు.

Also Read : మంత్రివర్గం నుంచి సీనియర్లను తప్పించిన చంద్రబాబు.. కారణమేంటో తెలుసా?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ తరువాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుందని తమిళిసై పేర్కొన్నారు. తమిళిసై తాజా వివరణతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు