Tollywood Best Friends : సినిమా కలిపిన బంధం.. సెలబ్రిటీల మధ్య స్నేహ బంధం .. టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే

ప్రతి ఇండస్ట్రీలోను చాలామంది మంచి స్నేహితులైన వారు ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సింగర్స్ ఇలా మనసులు కలిసి స్నేహాన్ని పంచుకునే వారు టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు. ఆగస్టు 6 ఆదివారం 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంలో వారి స్నేహాన్ని గుర్తు చేసుకుందాం.

Tollywood Best Friends

Tollywood Best Friends : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నటులు, సింగర్స్ స్నేహితులుగా ఉన్నారు. కలిసి పని చేసిన సందర్భంలో వారి మనసులు కలిసి మంచి స్నేహితులుగా మారిన వారున్నారు. ఆగస్టు 6  ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చూద్దాం.

బాపు-రమణ

చిన్ననాటి నుంచి వీరిద్దరు మంచి . ఒకరు బొమ్మలు గీస్తే.. మరొకరు రాతలతో అలరించారు. సినిమాల్లోకి వచ్చినా వీరి అనుబంధం అద్భుతంగా సాగింది. బాపు సినిమాలన్నింటిలో రమణ రాతలు ఉండేవి. సాక్షి, ముత్యాలముగ్గు, సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలే. ఇక వీరిద్దరు కలిసి చేసిన సినిమా శ్రీరామరాజ్యం. ఈ సినిమా అయ్యాక రమణ కన్నుమూశారు. రమణ తనువు చాలించిన కొన్నినాళ్లకే బాపు వెళ్లిపోయారు. తెలుగు సినిమా పరిశ్రమలో స్నేహం అనగానే ఇప్పటికీ ముందుగా వీరిద్దరి పేర్లు వినిపిస్తాయి.

Many heroes and directors are best friends in the Telugu film industry

త్రివిక్రమ్-పవన్ కల్యాణ్

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ చాలా కొద్దిమందితో సన్నిహితంగా కనిపిస్తారు. త్రివిక్రమ్ తో అనుబంధం ఎక్కువ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, భీమ్లానాయక్ వంటి సినిమాలు తీశారు. పవన్ నటించే కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ హస్తం ఉంటుంది.

Many heroes and directors are best friends in the Telugu film industry

మోహన్ బాబు-రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు, నిర్మాత మోహన్ బాబు మంచి స్నేహితులు. రజనీకాంత్ మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్’. ఆ సినిమా రీమేక్ ‘తూర్పు-పడమర’ గా వచ్చింది. తమిళంలో రజనీకాంత్ పాత్రలో మోహన్ బాబు నటించారు. రజనీకాంత్ హీరోగా ఎదిగే క్రమంలో ఆయన నటించిన సినిమాల్లో మోహన్ బాబు విలన్‌గా నటించారు. మోహన్ బాబు హీరోగా, రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన పెదరాయుడు సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

Many heroes and directors are best friends in the Telugu film industry

రామ్ చరణ్- శర్వానంద్-రానా

యంగ్ హీరోలైన రామ్ చరణ్, శర్వానంద్‌ల స్నేహం ఇప్పటిది కాదు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరిలో అనేక విషయాల్లో సిమిలారిటీ కనిపిస్తుంది. ఎప్పుడు అయ్యప్ప మాల ధరించినా ఇద్దరు కలిసి వేసుకోవడం విశేషం

Many heroes and directors are best friends in the Telugu film industry

ప్రభాస్-గోపీ చంద్

ప్రభాస్, గోపీచంద్‌లు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరిలో ఎవరి సినిమా వేడుక జరిగినా తప్పకుండా హాజరవుతారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు.

Many heroes and directors are best friends in the Telugu film industry

జూనియర్ ఎన్టీఆర్-రాజీవ్ కనకాల

జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహం ఇప్పటిది కాదు. స్టూడెంట్ నంబర్ 1 సెట్స్‌లో మొదలైంది. ఎవరి జీవితంలో వారు బిజీ అయినప్పటికీ ఇప్పటికీ వారి స్నేహబంధం కొనసాగుతోంది.

Many heroes and directors are best friends in the Telugu film industry

పూరీ జగన్నాథ్-రవితేజ

పూరీ జగన్నాథ్, రవితేజల స్నేహం 1996 మొదలైంది. ఇద్దరు ఒకరి ఎదుగుదలకు ఒకరు బాటలు వేసుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తరువాత ఇడియట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్ హిట్ అయ్యింది. దేవుడు చేసిన మనుష్యులు ఫ్లాప్ అయినా వరుసగా మాత్రం ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వెళ్తున్నారు. వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

Many heroes and directors are best friends in the Telugu film industry

నారా రోహిత్-శ్రీవిష్ణు

నారా రోహిత్ శ్రీవిష్ణు కూడా మంచి స్నేహితులు. వీరి స్నేహం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో రోహిత్ అత్యంత ఇష్టపడే వ్యక్తి హీరో విష్ణు. విష్ణు కెరీర్ నిలబెట్టడానికి తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించాడు.. విష్ణును హీరోగా పెట్టి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాడు రోహిత్. శ్రీవిష్ణు కూడా రోహిత్‌కు కథల ఎంపికలో సాయం చేశాడు. వీరి స్నేహం అందంగా కొనసాగుతోంది.

Many heroes and directors are best friends in the Telugu film industry

 

సునీత-అనితా చౌదరి

సింగర్ సునీతకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. కానీ ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన హోస్ట్, యాంకర్, నటి అనితా చౌదరితో మంచి స్నేహ బంధం ఉంది. అలాగే ప్రముఖ యాంకర్ సుమతో సునీతకు స్నేహం ఉంది.

Many heroes and directors are best friends in the Telugu film industry (6)

 

మంచు లక్ష్మి ,రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితులు. పార్టీలు, పబ్ లలో కలవడమే కాదు.. ఇద్దరు దిగిన ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మంచు లక్ష్మి చేసే ఏ షోకైనా రకుల్‌ను గెస్ట్ గా పిలుస్తుంటుంది. జెనీలియా, రామ్ 2008 లో రెడీ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడు మొదలైన వారి స్నేహం దశాబ్దకాలం దాటినా ఇంకా కొనసాగుతోంది. వీరిద్దరు తరచుగా కలుస్తుంటారు. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా రీల్స్, వీడియోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. జెనీలియా రామ్‌ను తన బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పడం విశేషం. అఖిల్-రామ్ చరణ్, నితిన్-అఖిల్ లు కూడా మంచి స్నేహితులు. వీరు తరుచుగా కలిసి టైం స్పెండ్ చేస్తారట.

 

నయనతార, త్రిష మంచి స్నేహితులు. ఒకప్పుడు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. చాలాసార్లు వారి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చినా వాటిని ఇద్దరు కొట్టిపారేశారు. ఇద్దరు చాలా చిన్నవయసులో కెరియర్ స్టార్ట్ చేశారు. ఇప్పటికీ వీరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.  హీరో శ్రీకాంత్-శివాజీరాజా, జగపతిబాబు-అర్జున్, సింగర్ గీతామాధురి-పర్ణికల మధ్య కూడా స్నేహ బంధం ఉంది. ఇండస్ట్రీలోనే వేరే వేరే విభాగాల్లో పనిచేస్తున్న కొన్ని సినిమాల్లో కలిసి పనిచేసిన సందర్భంలో మనసులు కలిసి మంచి స్నేహితులు అయిన వారు చాలామంది ఉన్నారు. ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా వీరందరి స్నేహం మరింత స్ట్రాంగ్ అవ్వాలని మనసారా విష్ చేద్దాం. హ్యాపీ ఫ్రెండ్సిఫ్ డే.

ట్రెండింగ్ వార్తలు