True Folding Smartphone : శాంసంగ్, ఒప్పోకు పోటీగా మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త ట్రూ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

True Folding Smartphone : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) నుంచి రియల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ రాబోతోంది. మైక్రోసాఫ్ట్ అందించే నెక్స్ట్ జనరేషన్ సర్ఫేస్ డ్యుయో 3ని లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

True Folding Smartphone : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) నుంచి రియల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ రాబోతోంది. మైక్రోసాఫ్ట్ అందించే నెక్స్ట్ జనరేషన్ సర్ఫేస్ డ్యుయో 3ని లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సర్ఫేస్ Duo 2 ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా రానుంది. మైక్రోసాఫ్ట్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. 180 ఫీచర్ ఉంటుంది. శాంసంగ్ వంటి బ్రాండ్‌లు Galaxy Z ఫోల్డ్ సిరీస్‌లో వస్తాయి. గత కొన్ని ఏళ్లుగా సెప్టెంబరు/అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ అనేక ప్రొడక్టులను లాంచ్ చేస్తోంది. 2021లో 360-డిగ్రీల సర్ఫేస్ డుయో 2ను కంపెనీ లాంచ్ చేసింది.

కంపెనీ గత ఏడాదిలో కొత్త-జెన్ ఫోల్డబుల్‌ ఫోన్ మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ, ఈ ఏడాదిలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కొత్త ఫోల్డింగ్ డివైజ్ లాంచ్ చేసే అవకాశం ఉంది. విండోస్ సెంట్రల్ ప్రకారం.. కొత్త ఫోల్డబుల్ Vivo X ఫోల్డ్, Honor మ్యాజిక్ ఫోన్ మాదిరిగా ఉండవచ్చునని రిపోర్టు తెలిపింది. ఫోన్‌లో మెయిన్ ఇంటర్నల్ డిస్‌ప్లే, ఔటర్ కవర్ స్క్రీన్ ఉంటుంది. 360-డిగ్రీకి బదులుగా 180-డిగ్రీల యాంగిల్ మాత్రమే సపోర్టు ఇస్తుంది.

Microsoft working on a true folding smartphone, may take on Samsung and Oppo

Read Also : Best Smartphones : 2023 జనవరిలో రూ. 12వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి!

ఈ కొత్త ఫోల్డబుల్ డివైజ్ హార్డ్‌వేర్ వారీగా ఫీచర్ లేదా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్ లేదా మోడ్ ద్వారా డ్యూయల్ స్క్రీన్‌తో రానుందా అనేది రివీల్ చేయలేదు. షిప్పింగ్ విండో కూడా లేదని తెలుస్తోంది. గత ఏడాదిలో మైక్రోసాఫ్ట్ పేటెంట్‌ డివైజ్ ఆన్‌లైన్‌లో కనిపించింది. అలాగే, ఫోల్డబుల్ ఫోన్‌ ఎప్పుడు లాంచ్ చేయనుందో నివేదిక వెల్లడించలేదు. ఫోల్డబుల్ డిజైన్‌లో మార్పుతో రానుంది. ఇంటర్నల్ డివైజ్ థర్డ్ పార్టీ Duoగా చెప్పవచ్చు.

ఫోల్డింగ్ ఫారమ్ ఫ్యాక్టర్ Office యాప్‌లను మెరుగ్గా ఆప్టిమైజ్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ Googleతో కలిసి పని చేస్తోంది. అయినప్పటికీ, Samsung, Oppo, Vivo, Xiaomiతో సహా అనేక బ్రాండ్లు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నాయి. గూగుల్ ఈ ఏడాదిలో పిక్సెల్ ఫోల్డ్‌ను కూడా లాంచ్ చేసింది. ఫోల్డబుల్స్ మొత్తం మార్కెట్ బాగానే కనిపిస్తుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ గ్లోబల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంచనా ప్రకారం.. గ్లోబల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు FY2023లో 52 శాతం YOY పెరుగుతాయని అంచనా వేసింది. మార్కెట్‌లోకి మరిన్ని బ్రాండ్‌లు రావడంతో ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy F04 Sale : శాంసంగ్ గెలాక్సీ F04 సేల్ మొదలైందోచ్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ట్రెండింగ్ వార్తలు