Ram Charan – Klin Kaara : ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.. క్లిన్ కారా గురించి రామ్ చరణ్ చెప్పిన బోలెడన్ని విషయాలు..

నేషనల్ మీడియాకు రామ్ చరణ్ ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చరణ్ తన కూతురు గురించి, తండ్రి అయ్యాక తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలిపాడు.

Ram Charan – Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా పూటడంతోనే పెద్ద సెలబ్రిటీ. మెగా అభిమానులు అంతా క్లిన్ కారాని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు క్లిన్ కారా ఫోటోలు బయట పెట్టినా ఎక్కడా ఫేస్ చూపించలేదు. ఇక రామ్ చరణ్ తండ్రిగా ప్రమోషన్ రావడంతో ఫుల్ సంతోషంగా ఉన్నారు. క్లిన్ కారాకు ఎక్కువ సమయం ఇస్తున్నాడు.

తాజాగా ఓ నేషనల్ మీడియాకు రామ్ చరణ్ ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చరణ్ తన సినిమాలు, తన ఫ్యామిలీ, తన కూతురు గురించి, తండ్రి అయ్యాక తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలిపాడు. దీంతో రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అలాగే ఓ స్పెషల్ ఫోటో కూడా రిలీజ్ చేశారు.

Also Read : Ram Charan – Klin Kaara : ఫాదర్స్ డే స్పెషల్.. రామ్ చరణ్, క్లిన్ కారా ఫోటో చూశారా?

రామ్ చరణ్ క్లిన్ కారా గురించి మాట్లాడుతూ.. క్లిన్ కారా ఇప్పుడు అందర్నీ గుర్తుపడుతుంది. నేను ఇంట్లో లేకపోతే నన్ను మిస్ అవుతుంది. ఆమె నా దగ్గర లేకపోయినా నేను కూడా మిస్ అవుతున్నాను. అసలు క్లిన్ కారాని వదిలి వెళ్లాలనిపించట్లేదు. రాబోయే రెండేళ్ల వరకు, కనీసం తను స్కూల్ కి వెళ్లెవరకూ అయినా నా టైమింగ్స్ అన్ని క్లిన్ కారాతో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. ఇప్పటికే నేను 15 ఏళ్ళు కష్టపడ్డాను,. ఇప్పుడు మాత్రం డైలీ సాయంత్రం 6 కల్లా ఇంటికి వచ్చి నా కూతురితో గడుపుతాను. తనని వదిలి వెళ్లడం నాకు కష్టంగానే ఉంది. తనని చూడగానే నా ఫేస్ లో ఒక సంతోషం వస్తుంది. నేను ఇంటి దగ్గరే ఉంటే క్లిన్ కారా కు నేనే తినిపిస్తాను. దాంట్లో మాత్రం మా ఇంట్లో ఎవరూ నాతో పోటీ పడలేరు. ఇంట్లో అందరూ తనకి తినిపించాడు కష్టపడతారు. నేను తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది అని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసాడు.

ట్రెండింగ్ వార్తలు