స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా విజయం.. సూపర్-8కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా విజయం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చింది.

T20 World Cup 2024 : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో ఆదివారం ఉదయం స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా విజయం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చింది. ఇంగ్లాండ్ జట్టు సూపర్ -8లోకి దూసుకెళ్లింది.

Also Read : టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో టీమిండియా ఏఏ జట్లతో ఎప్పుడు తలపడుతుందో తెలుసా..

తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు లాస్ట్ ఓవర్లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. గ్రూప్ -బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ జట్టు చెరో ఐదు పాయింట్లతో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ విజయం సాధించి ఉంటే ఇంగ్లాండ్ సూపర్ -8 ఆశలు గల్లంతయ్యేవి. కానీ, ఆస్ట్రేలియా విజయంతో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ జట్ల పాయింట్లు సమం అయ్యాయి. అయితే, రన్ రేట్ విషయంలో ఇంగ్లాండ్ మెరుగ్గా ఉండటంతో గ్రూప్ – బి నుంచి సూపర్ -8 దశలోకి ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ కూడా అడుగు పెట్టింది.

Also Read : Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌

సూపర్-8 ఆడే జట్లు ఇవే..
గ్రూప్-1: భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్/బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్
గ్రూప్-2: అమెరికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా

 

ట్రెండింగ్ వార్తలు