Sai Dharam Tej : పవన్ కళ్యాణ్‌కి గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు.. చిన్నపిల్లాడిలా ఏం ఇచ్చాడో తెలుసా?

తాజాగా మామయ్యకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ దిగిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పవన్ గెలుపు తర్వాత సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ, అభిమానులు, కార్యకర్తలు అందరూ ఆనందంలో ఉన్నారు. ఇప్పటికీ పవన్ కి శుభాకాంక్షలు వస్తూనే ఉన్నాయి. ఇక పవన్ గెలుపుకి పలువురు స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. నిన్నే పవన్ కళ్యాణ్ వదిన, చిరంజీవి భార్య ఖరీదైన పెన్ ని పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చింది.

తాజాగా పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి – సాయి ధరమ్ తేజ్ కి మధ్య చాలా సన్నిహిత బంధం ఉంది. మామయ్య అంటే తేజ్ కి పిచ్చి. మామయ్య తన గురువు అని, చిన్నప్పట్నుంచి పవన్ మామయ్య దగ్గరే పెరిగానని చెప్తూ ఉంటాడు. పవన్ గెలుపు తర్వాత తేజ్ ఫుల్ సంతోషంతో ఉన్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మామయ్యని ఎత్తుకొని గాల్లోకి తిప్పాడు. ఇటీవల మామయ్య గెలిచినందుకు తిరుమలకు కాలినడకన వెళ్లి వచ్చాడు తేజ్.

Also Read : Ram Charan – Klin Kaara : ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.. క్లిన్ కారా గురించి రామ్ చరణ్ చెప్పిన బోలెడన్ని విషయాలు..

తాజాగా మామయ్యకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ దిగిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సాయి ధరమ్ తేజ్. స్టార్ వార్స్ లెగో బొమ్మలు గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఫోటో షేర్ చేసి.. నా ప్రియమైన మాస్టర్, డిప్యూటీ సీఎం.. చిన్నప్పుడు నాకు స్టార్ వార్స్ & లెగోలను పరిచయం చేసాడు. ఇప్పుడు నేను అదే మళ్ళీ ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చి ఆయనలోని పిల్లాడ్ని బయటకు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని పోస్ట్ చేసాడు. దీంతో తేజ్ పోస్ట్, ఫోటో వైరల్ గా మారింది.


 

 

ట్రెండింగ్ వార్తలు