TTD : తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. టోకెన్ లేకుండా శ్రీవారి దర్శనానికి..

టీటీడీ నూతన ఈవోగా జె. శ్యామలరావును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tirumala Tirupati Devasthanams : వరుస సెలవులు నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శిలాతోరణం, ఆక్టోపస్ భవనంవైపు నుండి నందకం వరకు క్యూ లైన్లలో భక్తులు దర్శనంకోసం వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు సమయం పడుతుంది. అయితే, క్యూలైన్లలో వేచిఉండే భక్తులకు శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు.

Also Read : TTD : టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావును నియమించిన ఏపీ ప్రభుత్వం

టీటీడీ నూతన ఈవోగా జె. శ్యామలరావును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండురోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, జె. శ్యామలరావు ఇవాళ మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్యామలరావు 1997 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్న శ్యామలరావు సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతోపాటు, రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పనిచేసి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు ఉండటంతో.. ఇలాంటి అధికారి టీటీడీ ఈవోగా ఉంటే బాగుంటుందని భావించిన ప్రభుత్వం ఆమేరకు నియామకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read : తమిళనాడు అటవీ అధికారుల అతితెలివి.. చిరుత పులిని ఏం చేశారంటే..

శనివారం తిరుమల శ్రీవారిని 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.09 కోట్లు సమకూరింది.

 

ట్రెండింగ్ వార్తలు