Ram Charan – Klin Kaara : ఫాదర్స్ డే స్పెషల్.. రామ్ చరణ్, క్లిన్ కారా ఫోటో చూశారా?

ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Ram Charan – Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా ఫోటో కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు క్లిన్ కారా ఫొటోలు బయటకు వచ్చినా ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు చరణ్, ఉపాసన. తాజాగా ఫాదర్స్ డే స్పెషల్ ఓ ఫోటో బయటకు వచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Also Read : O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ ట్రైలర్ చూశారా?

ఈ ఇంటర్వ్యూ నేడు ఫాదర్స్ డే సందర్భంగా పబ్లిష్ అయింది. ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కావడంతో క్లిన్ కారాతో దిగిన ఫొటోని కూడా పబ్లిష్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. మొదటిసారి రామ్ చరణ్ సింగిల్ గా క్లిన్ కారాతో కలిసి దిగిన ఫోటో బయటకి రావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి, కూతురు గురించి, తండ్రి అయ్యాక తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది తెలిపాడు.

 

ట్రెండింగ్ వార్తలు