O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ ట్రైలర్ చూశారా?

తాజాగా ఓ మంచి ఘోస్ట్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ ట్రైలర్ చూశారా?

Horror Comedy Movie OMG O Manchi Ghost Trailer Released

O Manchi Ghost Trailer : వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ సినిమా నుంచి సాంగ్స్, కాన్సెప్ట్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులని మెప్పించాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందరినీ చంపేస్తోందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలయింది. డబ్బు కోసం కొంతమంది ఆ బిల్డింగ్ లోకి వెళ్తే అక్కడి దయ్యాలు వాళ్ళని ఎలా భయపెట్టాయి, ఆ దయ్యాల కథలేంటి అనే కథాంశంతో హారర్ కామెడీతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ సినిమాలో హారర్ కామెడీతో పాటు సూపర్ నేచురల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ సినిమా జూన్ 21న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.