Free Aadhaar Update : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి మరోసారి గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. యూఐడీఏఐ ప్రకారం.. యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అప్డేట్లకు మాత్రమ రూ. 50 రుసుము వర్తిస్తుంది.
Read Also : Best Mobile Phones 2024 : ఈ నెలలో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
సెప్టెంబర్ 14 వరకు యూఐడీఏఐ వెబ్సైట్ ఆన్లైన్ పోర్టల్లో పేరు, అడ్రస్, ఫోటో ఇతర వివరాల వంటి మార్పులను ఉచితంగా అప్డేట్ చేయవచ్చు. ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు తేదీని పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు గడువు తేదీలకు పొడిగించింది. డిసెంబర్ 15, 2023 తర్వాత మార్చి 14కి పొడిగించగా.. ఆ తర్వాత జూన్ 14కి, ఇప్పుడు సెప్టెంబర్ 14కి పొడిగించింది యూఐడీఏఐ.
ఆధార్ కార్డ్ వివరాలను ఫ్రీగా ఎలా అప్డేట్ చేయాలంటే? :
Read Also : iPhone 15 Pro Action Button : ఐఓఎస్ 18 సపోర్టు.. ఆపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్లో మరిన్ని ఫీచర్లు..!