Pranaya Godari : కమెడియన్ అలీ సోదరుని కొడుకు హీరోగా ఫస్ట్ సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి..

తాజాగా ప్రణయ గోదారి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Pranaya Godari : తన కామెడీతో ఎన్నో సినిమాలలో మెప్పించాడు అలీ. ఆ తర్వాత అలీ తమ్ముడు ఖుయ్యుమ్ కూడా పలు సినిమాలతో పలకరించగా ఇప్పుడు కమీడియన్ అలీ ఇంటి నుంచి మరో నటుడు వచ్చాడు. కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా పిఎల్‌వి క్రియేషన్స్‌ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో PL విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రణయ గోదారి’.

Also Read : O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ ట్రైలర్ చూశారా?

ఇప్పటికే ప్రణయ గోదారి సినిమా షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదగా ప్రణయ గోదారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాగే PLV క్రియేషన్స్ బ్యానర్ లోగో కూడా లాంచ్ చేశారు. మూవీ టీమ్ అందరికి అల్ ది బెస్ట్ చెప్పారు మంత్రి.

ఈ పోస్టర్ చూస్తుంటే..గోదావరి లొకేషన్స్ లో, అక్కడి ప్రజలకు తగ్గట్టు, మత్స్యకారులు.. ఇలా సహజంగా ఈ సినిమాని చిత్రీకరించినట్టు తెలుస్తుంది. పోస్టర్ లో హీరో హీరోయిన్ సైకిల్ మీద కూర్చుంటే ఇంకో వ్యక్తి వెనక కూర్చున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు