Jio Data Booster Plans : మీ రోజువారీ ఇంటర్నెట్ డేటా లిమిట్ దాటిందా? జియో మొబైల్ డేటా బూస్టర్ ప్లాన్లు ఇదిగో.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

Jio Data Booster Plans : ఆన్‌లైన్‌లో ఎటువంటి అంతరాయాలు లేకుండా డేటాను పొందడానికి ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ప్లాన్‌లను రిలయన్స్ జియో అందిస్తుంది.

Jio Mobile Data Booster Plans : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన మొబైల్ డేటా ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ డేటా లిమిట్ దాటిన తర్వాత చాలామంది యూజర్లకు డేటా ఆగిపోవడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో కనెక్ట్ కావడం అనేది ప్రస్తుత ఆధునిక యుగంలో, రోజువారీ ఇంటర్నెట్ డేటా వాడకం భారీగా ఉంటుంది. ఏదైనా ఆఫీసు వర్క్ నుంచి పర్సనల్ వర్క్ వరకు అన్ని సోషల్ మీడియా, యూపీఐ పేమెంట్లు లేదా మీకు ఇష్టమైన టీవీషోలను స్ట్రీమింగ్ చేసినప్పుడు డేటా అయిపోవడం జరుగుతుంది.

Read Also : Jio Prepaid Plan Offers : జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లు.. అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్లు మీకోసం.. ఏ ప్లాన్ బెటర్ అంటే?

చాలావరకూ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ‘అన్ లిమిటెడ్ ఇంటర్నెట్’ను అందిస్తున్నప్పటికీ, నిజంగా అన్‌లిమిటెడ్ హై స్పీడ్ కాదు. రోజువారీ ఇంటర్నెట్ వినియోగ పరిమితి ముగిసిన తర్వాత డేటా స్పీడ్ దాదాపు 64KBPSకి తగ్గుతుంది. జియో మొబైల్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఎటువంటి అంతరాయాలు లేకుండా డేటాను పొందడానికి ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ప్లాన్‌లను రిలయన్స్ జియో అందిస్తుంది. చిన్న టాప్-అప్ లేదా అధిక మొత్తంలో డేటా బూస్ట్ అవసరమైతే జియో ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ఒక ప్లాన్‌ అందిస్తుంది.

జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు :
జియో రూ. 15 ప్లాన్ :
డేటా టాప్-అప్ అవసరమయ్యే యూజర్ల కోసం రూ. 15 ప్లాన్ సరైన ఆప్షన్. ఒక జీబీ వరకుడేటాను అందిస్తుంది. మీ ప్రస్తుత ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు వ్యాలిడిటీతో వస్తుంది. రోజు మొత్తం డేటా పొందేందుకు తక్కువ మొత్తంలో డేటా అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ సరైనదిగా చెప్పవచ్చు.

జియో రూ. 19 ప్లాన్ :
రూ. 19 ప్లాన్.. 1.5జీబీ డేటాతో పెద్ద డేటాను అందిస్తుంది. రూ. 15 ప్లాన్ మాదిరిగానే ఈ ప్లాన్ వ్యాలిడిటీ యాక్టివ్ ప్లాన్ వ్యవధికి సమానంగా ఉంటుంది. కొంచెం అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

జియో రూ. 25 ప్లాన్ :
ఎక్కువ డేటా అవసరమయ్యే యూజర్ల కోసం రూ. 25 ప్లాన్ 2జీబీ డేటాను అందిస్తుంది. డేటా తొందరగా అయిపోతుందనే ఆందోళన అవసరం లేదు. మీరు బ్రౌజింగ్ లేదా స్ట్రీమింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్‌లో వ్యాలిడిటీతోనే వస్తుంది.

జియో రూ 29 ప్లాన్ :
2జీబీ డేటా సరిపోవడం లేదా? రూ 29 ప్లాన్ ద్వారా2.5జీబీ డేటాను అందిస్తుంది. అంతరాయం లేని ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. తద్వారా రోజువారీ డేటా పరిమితికి మించి డేటాను వినియోగించే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్‌తో వస్తుంది.

జియో రూ. 61 ప్లాన్ :
ఎక్కువ డేటా అవసరమయ్యే యూజర్లకు రూ.61 ప్లాన్ గణనీయమైన 6జీబీ అదనపు డేటాను అందిస్తుంది. యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీని కొనసాగిస్తూనే వారి డేటా అవసరాలకు వినియోగించుకోవచ్చు. భారీ డేటా వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఉంటుంది.

జియో రూ.121 ప్లాన్ :
రూ.121 ప్లాన్.. మొత్తం డేటా వాడే యూజర్ల కోసం అందిస్తోంది. 12జీబీ డేటాతో వీడియోలను స్ట్రీమింగ్ చేయడం నుంచి పెద్ద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం వరకు వివిధ ఆన్‌లైన్ యాక్టివిటీలకు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీతో కలిసి వస్తుంది.

క్రికెట్ డేటా ప్యాక్ జియో రూ. 222 :
క్రికెట్ ఔత్సాహికులు, భారీ డేటా వాడే జియో యూజర్ల కోసం జియో క్రికెట్ డేటా ప్యాక్‌ను రూ. 222 ధరకు అందిస్తుంది. ఈ ప్రత్యేక ప్యాక్‌లో 50జీబీ హై-స్పీడ్ డేటా ఉంటుంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. అధిక డేటా వినియోగానికి ఈ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ ప్రస్తుత ప్లాన్ వ్యవధికి కూడా వ్యాలిడిటీని పొందవచ్చు.

Read Also : Reliance Jio 5G Phone : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. చౌకైన ధరకే కొత్త జియో 5జీ ఫోన్ వస్తోంది.. ధర కేవలం రూ.3వేలు మాత్రమే!

ట్రెండింగ్ వార్తలు