MLC Kavitha: అరవింద్‌పై అందుకే కోపమొచ్చింది.. కేటీఆర్, హరీశ్‎రావు విషయంలో కామెంట్‌ చేసే స్థాయి నాకులేదన్న కవిత

కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంలో నాపాత్ర లేదని కవిత తెలిపారు. కేసీఆర్, పార్టీలోని పెద్దవాళ్లు తీసుకున్న నిర్ణయం అని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వారు సరియైన నిర్ణయమే తీసుకున్నారని నేను ఓ పార్టీ కార్యకర్తగా అనగలుగుతానని, అంతకుమించి కామెంట్ చేసే అవకాశం నాకులేదని కవిత అన్నారు.

MLC Kavitha: బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయంగా బేధాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అరవింద్‌పై కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ అరవింద్‌పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ నిజామాబాద్‌లో యాక్సిడెంటల్‌గా గెలిచారని, ఇకపై ఆయన ఆటలు సాగవని.. ఈసారి అరవింద్ ఎక్కడ పోటీ‌చేస్తే అక్కడివెళ్లి ఆయన్నుఓడిస్తామంటూ కవిత వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రతీ శనివారం 10టీవీలో ప్రసారమయ్యే ‘వీకెడ్ విత్ నాగేశ్వర్’ ప్రోగ్రాంకు ఈవారం కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్‌పై ఎందుకు తీవ్రస్థాయిలో కోపాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందో చెప్పారు.

MLC Kavitha: బీఆర్ఎస్‌లోకి ఈటల..? ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

ఎంపీ అరవింద్ హద్దులుదాటి మాట్లాడుతున్నాడని అందుకే అతనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందని కవిత అన్నారు. ఆ రోజు నేను ప్రెస్‌మీట్ పెట్టేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పానని, నేను ఇవ్వాళ మాట్లాడాల్సిన అవసరం వచ్చిందికాబట్టి పరుష పదజాలాన్ని ఉపయోగించాల్సి వస్తుందని అన్నానని కవిత గుర్తు చేశారు. ఏదిపడితే అది మాట్లాడొచ్చు, ఎంపీగా గెలిచినా కాబట్టి ఎంతబడితే అంత మాట్లాడతా అంటే ప్రజలు కూడా ఒప్పుకోరని కవిత అన్నారు. ప్రజలు మెచ్చేవిధంగా, హూందాగా రాజకీయాలు చేయాలని అప్పుడే మనకు రాజకీయాల్లో విలువ ఉంటుందని కవిత చెప్పారు.

MLC Kavitha Letter: ప్రీతి కుటుంబానికి మేము హామీ ఇస్తున్నాము: ఎమ్మెల్సీ కవిత

కేటీఆర్, హరీశ్‌రావుల్లో హరీశ్ సీనియర్, మరి కేటీఆర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉందని, దీనిపై మీరెలా స్పందిస్తారని కవితను ప్రశ్నించగా.. ఒక పార్టీలో ఉండేటువంటి అనేక విషయాలను తీసుకొని పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ మధ్యలో కామెంట్ చేసేఅంత స్థాయి నాకులేదని, వారిద్దరికంటే నేను చాలా జూనియర్ అంటూ కవిత చెప్పారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంలో నాపాత్ర లేదని కవిత తెలిపారు. కేసీఆర్, పార్టీలోని పెద్దవాళ్లు తీసుకున్న నిర్ణయం అని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వారు సరియైన నిర్ణయమే తీసుకున్నారని నేను ఓ పార్టీ కార్యకర్తగా అనగలుగుతానని, అంతకుమించి కామెంట్ చేసే అవకాశం నాకులేదని కవిత అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు