MLC Kavitha: బీఆర్ఎస్‌లోకి ఈటల..? ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు.

MLC Kavitha: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి తన సొంతగూటికి చేరుతారంటూ సోషల్ మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని, బీజేపీలోనే కొనసాగుతానంటూ స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఈటలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి. అసెంబ్లీ సమావేశాల్లో రెండు గంటలకుపైగా ప్రసంగించిన కేసీఆర్.. పలుసార్లు మిత్రుడు ఈటల రాజేందర్ అంటూ సంబోధించారు. అంతేకాదు.. ఈటల లేవనత్తిన సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావునుసైతం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఈటల బీఆర్ఎస్‌లోకి వెళ్లడం ఖాయమంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో మళ్లీ ఈటల స్పందించి తాను బీజేపీలోనే ఉంటానని చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌లోకి వస్తున్నారా అనే అంశంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

MLC Kavitha : కేంద్రం చేసిన వంద లక్షల కోట్లు అప్పు మాటేమిటి? నిర్మలమ్మకు కవిత కౌంటర్

10టీవీలో ప్రతీవారం ప్రసారమయ్యే వీకెడ్ విత్ నాగేశ్వర్ ప్రోగ్రాంకు ఈవారం కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై పలు ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అన్నప్రశ్నలకు కవిత స్పందిస్తూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈటల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్‌లోకి వస్తే మాకేం ఇబ్బంది లేదని కవిత స్పష్టం చేశారు. ఈటల బీఆర్ఎస్‌లోకి వస్తే పర్సనల్‌గా నేను సంతోషిస్తానని, అయితే, ఈటలను పార్టీలోకి తిరిగి ఆహ్వానించాలా? వద్దా? అనే విషయం నా చేతుల్లో లేదని, ఆ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు.

MLC Kavitha Letter: ప్రీతి కుటుంబానికి మేము హామీ ఇస్తున్నాము: ఎమ్మెల్సీ కవిత

ఈటల రాజేందర్‌ను మేము పంపించలేదని, ఆయన వెళ్లారని, ఎందుకు వెళ్లారో ఆయనకే తెలియాలంటూ కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి వీడిన వారుకూడా మళ్లీ తిరిగి వస్తామంటే ఆహ్వానిస్తామని అన్నారు. రాజకీయ ఆల్టర్నేటివ్ తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీనే కాబోతుందని కవిత తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు