Agnipath : ఎంఎంటీఎస్,మెట్రో రైళ్లు రద్దు…కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు దారి మళ్లింపు

ఆర్మీ రిక్రూట్ మెంట్‌లో  అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనకారుల చేపట్టిన ఆందోళనలో   రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి.

Agnipath :  ఆర్మీ రిక్రూట్ మెంట్‌లో  అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనకారుల చేపట్టిన ఆందోళనలో   రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో తిరిగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

నగరంలోని కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు. సికింద్రాబాద్ రావల్సిన పలు రైళ్లను శివారు ప్రాంతాలలో నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి బయలు దేరాల్సిన ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ సర్వీసులను కొన్నిటిని బయలు దేరే స్టేషన్లను మార్పు చేశారు. కొన్నిరైళ్లను రూట్లు మార్చారు.

లింగంపల్లి సనత్ నగర్ నుంచి బయలుదేరే కొన్నిరైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ కు రాకుండా దారి మళ్లించి నడుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ లోనే నిలిపి  వేస్తున్నారు. సనత్ నగర్, అమ్ముగూడ, చర్లపల్లి మీదుగా   కొన్నిరైళ్లను దారి మళ్లించారు.

హైదరాబాద్-షాలిమార్ (18046)
ఉందానగర్-సికింద్రాబాద్ (07078)
సికింద్రాబాద్-ఉందానగర్ (07055)
ఉందానగర్-సికింద్రాబాద్ (07056)
సికింద్రాబాద్-ఉందానగర్ (07059)
ఉందానగర్-సికింద్రాబాద్ (07060) రైళ్లను 17వ తేదీన పూర్తిగా రద్దు చేశారు.

సికింద్రాబాద్-రేపల్లె (17645) రైలును సికింద్రాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి స్టేషన్ నుంచి 17వ తేదీన ప్రయాణిస్తుంది.

షిర్డీ సాయి నగర్ – కాకినాడ పోర్ట్ (17025) రైలును సనత్ నగర్, అమ్ముగూడ, చర్లపల్లి మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ లోకి రాదు. సనత్ నగర్, చర్లప్లలిలో ఆగుతుంది.

భువనేశ్వర్ – ముంబై సీఎస్ టీ (11020) చర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా వెళుతుంది. ఈ రెండూ 16వ తేదీన బయల్దేరిన వాటికి ఈ షెడ్యూల్ వర్తిస్తుంది.

Also Read :Agnipath Scheme Protest : రైళ్ల పునరుధ్దరణకు అధికారుల అత్యవసర సమావేశం

ఇక హౌరా-సికింద్రాబాద్ (12703) రైలును పాక్షికంగా మౌలాలి-సికింద్రాబాద్ మధ్య నేడు రద్దు చేశారు.
సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234) రైలు సైతం మౌలాలి-సికింద్రాబాద్ మధ్య ప్రయాణించదు.

గుంటూరు – వికారాబాద్ (12743) రైలు చర్లపల్లి-వికారాబాద్ మధ్య ప్రయాణించదు. దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ ఈ వివరాలను విడుదల చేశారు.

Also Read: Agnipath: రైళ్ళ‌ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుంది: సీపీఆర్వో రాకేశ్

ట్రెండింగ్ వార్తలు