Multi Cropping In Oil Plam : ఆయిల్ పామ్ లో అంతరపంటగా కోకో, వక్కసాగు

అంతర పంటలుగా కోకో, వక్క, కంది పంటలను సాగుచేస్తున్నారు రైతు ధర్మానారాయణ ప్రసాద్. అంతర పంటలు వేయడం వలన ఒక పంట దెబ్బతిన్నా, మరో పంట ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది.

Multi Cropping In Oil Plam Cultivation

Multi Cropping In Oil Plam : ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. నాలుగైదు ఏళ్ల తర్వాత దిగుబడి వచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. దీన్నే ఆచరించి సాగుచేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. పామాయిల్ తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, కంది పండిస్తున్నారు. అంతర పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని అవలంభించడం వల్ల, ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు.

READ ALSO : Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం

కోస్తాజిల్లాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న తోటపంట పామాయిల్ .  నాటిన మూడేళ్ల వరకు ఈ తోటల నుండి దిగుబడి రాదు కనుక,  రైతులు మొదటి  రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అంతరపంటలు సాగుచేస్తుంటారు. ఆ తర్వాత చెట్లు ఎత్తుబాగా ఎత్తు పెరుగుతాయి కనుక నీడ ఎక్కువగా వుండి అంతరపంటల సాగుకు అంతగా అనుకూలంగా వుండదనేది రైతుల అభిప్రాయం. కానీ పామాయిల్ లో కోకో, వక్క, కంది లాంటివి అంతర పంటలుగా సాగుచేస్తే దీటైన ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, ద్వారాకా తిరుమల మండలం, రాళ్లగుంట గ్రామానికి చెందిన రైతు, గంటా ధర్మనారాయణ ప్రసాద్.

ధర్మనారాయణ ప్రసాద్ 8 ఎకరాల్లో ఉన్న పామాయిల్ తోటను 5 ఏళ్ల క్రితం నాటారు. అయితే నాటిన నాలుగైదేళ్లు దిగుబడి రాదు కనుక,  అంతర పంటలుగా కోకో, వక్క, కంది పంటలను సాగుచేస్తున్నారు రైతు ధర్మానారాయణ ప్రసాద్. అంతర పంటలు వేయడం వలన ఒక పంట దెబ్బతిన్నా, మరో పంట ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది.

READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

ఈ విధానం వల్ల అదనపు అదాయంతోపాటు, పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీటకాలు , తెగుళ్ళు, కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. ఈ విధానంలో భూమిలో పోషకాలు పెరిగి, ప్రధాన పంట నుండి అధిక దిగుబడులు వస్తాయని రైతు చెబుతున్నారు.

సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నపరిస్థితుల్లో… ప్రతీ రైతు ఆదాయం పెంచుకునే దిశగా… ఆధునిక పరిజ్ఞానంతో, ప్రణాళికాబద్దంగా ముందడుగు వేయాల్సిన అవసరం వుంది. భవిషత్తులో రారాజు ఒక రైతు మాత్రమేనని ఘంటాపథంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

READ ALSO : Rugose white : కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో రూగోస్‌ తెల్లదోమ నివారణ

ట్రెండింగ్ వార్తలు