OnePlus Nord CE 3 Lite Price : అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

OnePlus Nord CE 3 Lite Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందంటే?

OnePlus Nord CE 3 Lite Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త 5G ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,999తో మొదలై రూ.21,999 వరకు ఉంది. ఈ ధరకే కొత్త (OnePlus Nord 3 Lite) సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ, ఈ కొత్త (OnePlus 5G) ఫోన్ కొనడం సరైనదేనా? అంటే.. కెమెరా పర్ఫార్మెన్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ డిజైన్‌ను అందిస్తుంది. ఇతర (OnePlus) ఫోన్‌ల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఇటీవలే మార్కెట్లో పెద్ద కెమెరా సెన్సార్‌లతో లాంచ్ అయిన కొన్ని రియల్‌మి ఫోన్‌ల మాదిరిగానే ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite మోడల్ ఫోన్ పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో లైమ్ కలర్ బాగుంటుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ రిఫ్రెష్ లుక్‌తో వస్తుంది. (OnePlus Nord CE 3 Lite) బాగా బ్యాలెన్స్‌డ్ స్మార్ట్‌ఫోన్, చాలా తక్కువ బరువు ఉంటుంది. రోజంతా ఒక చేత్తో ఫోన్‌ని ఉపయోగించినా ఎలాంటి సమస్యలు ఉండవు.

బ్యాటరీ విషయానికి వస్తే.. ఫాస్ట్ ఛార్జింగ్ కొత్త వన్‌ప్లస్ (Nord CE 3 Lite) స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో రానుంది. సింగిల్ ఛార్జ్‌తో ఫుల్‌డే వస్తుంది. బాక్స్‌లో 80W ఛార్జర్‌తో పాటు 67W SUPERVOOC ఛార్జ్ ద్వారా సపోర్టు అందిస్తుంది. ఛార్జర్ 75 శాతానికి చేరుకోగానే.. సుమారు 25 నిమిషాలు, పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 40 నిమిషాలు పట్టవచ్చు.

Read Also : OnePlus Nord CE Offer : అమెజాన్‌లో అదిరే ఆఫర్.. రూ.20వేల విలువైన వన్‌ప్లస్ 5G ఫోన్.. కేవలం రూ.1,299 మాత్రమే..!

వన్‌ప్లస్ Nord CE 3 Lite 5G ఫోన్ 5G సపోర్టుతో Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌తో వస్తుంది. గత ప్రాసెసర్ మాదిరిగానే.. కొత్త ఫోన్ (Nord CE 2 Lite) గరిష్టంగా 8GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్‌ మల్టీటాస్కింగ్, గేమింగ్‌ కోసం వినియోగించుకోవచ్చు. 30 నిమిషాల గేమింగ్ తర్వాత కూడా వేడెక్కదు. Android 13 ఆధారిత OxygenOS 13.1 సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌తో అందిస్తుంది. కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లను ప్రి-ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. మీరు ఈ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయవచ్చు.

OnePlus Nord CE 3 Lite Price (Photo : OnePlus)

108MP కెమెరా సిస్టమ్‌తో నార్డ్ ఫోన్..
కెమెరాల పరంగా చూస్తే.. Nord CE 3 Lite ఫోన్ ముందున్న దాని కన్నా బెస్ట్ అప్‌గ్రేడ్. 108-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 16-MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ మంచిదే అయినప్పటికీ.. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ సాధారణంగా మంచి లైటింగ్ కండిషన్లలోనూ బెటర్ షాట్‌లను అందిస్తుంది. కొన్నిసార్లు సమస్య కావచ్చు. రూ. 15వేల ధరలో కన్నా ఎక్కువ ఉన్న ఫోన్‌లకు AMOLED డిస్‌ప్లేతో రానుంది. వన్‌ప్లస్ Nord CE 3 Lite LCD ప్యానెల్‌ని ఎంచుకుంది.

ఈ ఫోన్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేతో రానుంది. గత వెర్షన్ల కన్నా బెటర్ ఫీచర్లతో రానుంది. LCD స్క్రీన్ కలిగి ఉండనుంది. AMOLED ప్యానెల్‌తో రావొచ్చు. అయినప్పటికీ, ఈ ఫోన్ డిస్ప్లే బెటర్ వ్యూను అందిస్తుంది. వన్‌ప్లస్ Nord CE 3 Lite ఫోన్ రూ. 20వేల ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ (Amazon.in), (OnePlus.in) దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టనర్ స్టోర్‌లలో అందుబాటులో ఉండనుంది.

Read Also : Twitter Bird Logo : బుల్లిపిట్ట తిరిగొచ్చింది.. ట్విట్టర్‌‌ ‘డాగీ కాయిన్’ లోగో మార్చేశాడు.. మస్క్ మామూలోడు కాదుగా..!

ట్రెండింగ్ వార్తలు