Babar Azam : బ్రా ధరించిన బాబర్ ఆజామ్..! ప‌రుగో ప‌రుగు.. అరె ఏంట్రా ఇది..

క్రికెట‌ర్లు మైదానంలో ఉండే అభిమానుల‌కు గిఫ్టులు ఇస్తుండ‌టాన్ని అప్పుడ‌ప్పుడూ మ‌నం చూస్తూనే ఉంటాం. త‌మ‌ బ్యాట్ల‌ను గానీ, జెర్సీల‌ను గానీ, గ్లౌస్‌ల‌ను గానీ బాల్‌ల‌ను గానీ ప్రేక్ష‌కులు ఇస్తుంటారు.

Babar Azam wearing sports bra : అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసిన‌ప్పుడు గానీ లేదంటే మ్యాచుల్లో గెలిచిన సంద‌ర్భాల్లో క్రికెట‌ర్లు మైదానంలో ఉండే అభిమానుల‌కు గిఫ్టులు ఇస్తుండ‌టాన్ని అప్పుడ‌ప్పుడూ మ‌నం చూస్తూనే ఉంటాం. త‌మ‌ బ్యాట్ల‌ను గానీ, జెర్సీల‌ను గానీ, గ్లౌస్‌ల‌ను గానీ బాల్‌ల‌ను గానీ ప్రేక్ష‌కులు ఇస్తుంటారు. అలాగే శ్రీలంక‌ను వారి స్వ‌దేశంలో ఓడించి రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను గెలుచుకున్న ఆనందంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ కూడా త‌న చొక్కా తీసి ఓ అభిమానికి బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

ఇక్క‌డ వ‌ర‌కు అంతా బాగానే ఉంది. అయితే.. చొక్కా విప్పిన బాబ‌ర్‌ను చూసి అంతా షాక్ అయ్యారు. అత‌డు ధ‌రించిన ఇన్న‌ర్ వేరే అందుకు కార‌ణం. మామాలుగా అయితే మ‌గ‌వాళ్లు బ‌నియ‌న్ లేదా ట్ర‌క్ లాంటివి ఇన్న‌ర్ వేర్‌గా వేసుకుంటారు. అయితే.. బాబ‌ర్ మాత్రం మ‌హిళ‌లు ధ‌రించే బ్రా లాటింది ధ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Stuart Broad : స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘ‌న‌త.. ఆసీస్ పై ఈ రికార్డు అందుకున్న‌ ఒకే ఒక్క‌డు

అయితే.. అస‌లు విష‌యంలోకి వెళ్తే మాత్రం బాబ‌ర్ ఆజామ్ ధ‌రించింది బ్రా కాద‌ని, బ్రాలా క‌నిపించే వెస్ట్ అని తేలింది. దీనిని ఆట‌గాళ్లు ఎక్కువ‌గా ధ‌రిస్తుంటార‌ని తెలిసింది. స్పోర్ట్స్ బ్రాల క‌నిపించే దీనిని ‘కంప్రెష‌న్ వెస్ట్’ అని అంటారు. ఇది భుజాల మ‌ధ్య ఉన్న వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాడుతుంటారు. ఇది చాలా తేలిక‌గా ఉంటుంద‌ట‌. వేసుకున్న విష‌యం కూడా ధ‌రించిన వ్య‌క్తి గుర్తించ‌లేనంత తేలిక‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ర‌న్నింగ్ స్పీడ్‌ని లెక్కించొచ్చు..

కంప్రెష‌న్ వెస్ట్‌లో ఎన్నో ఫీచ‌ర్లు ఉన్నారు. దీనికి GPS ట్రాకర్ ఉంటుంది. ఇది ఆట‌గాళ్ల ర‌న్నింగ్ స్పీడ్‌ని లెక్కించేందుకు వాడుతారు. గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ వంటివి ఉన్నాయి. ఇది ఆటగాళ్ల కదలికలను 3Dలో కొలుస్తూ వారి స్థానాలను ట్రాక్ చేస్తుంటుంది. ఇందులో హృద‌య స్పంద‌న మానిట‌ర్ కూడా ఉంది. ఈ మొత్తం స‌మాచారాన్ని సెంట్ర‌ల్ డేటాబేస్‌తో అనుసంధిస్తారు. మొత్తం స‌మాచారాన్ని విశ్లేషించి ఆట‌గాళ్ల ఫిట్‌నెస్‌ను అంచ‌నా వేస్తుంటారు.

Mens T20 WorldCup 2024 : టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024కి అర్హ‌త సాధించిన ప‌సికూన‌.. ఎవ‌రో తెలుసా..? ఇంకా 5 బెర్తులు ఖాళీగానే..

ఇక టీమ్ఇండియాలోని కొంద‌రు ఆట‌గాళ్లు కూడా వీటిని ఉప‌యోగిస్తున్నార‌ట‌. 2018లో అప్ప‌టి భార‌త‌ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు దీని వినియోగాన్ని తొలి సారి భార‌త ఆట‌గాళ్ల‌కు తెలియ‌జేశారు.

ట్రెండింగ్ వార్తలు