Mahmudullah : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓట‌మి.. మ‌రో స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ క్రికెట్‌కు వీడ్కోలు..

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌దుల్లా రియాద్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.

Mahmudullah retirement : వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 విజేత‌గా భార‌త జ‌ట్టు నిలిచింది. ద‌క్షిణాఫ్రికాతో ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన వెంట‌నే టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్ కూడా టీ20ల‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈ జాబితాలో మ‌రో ఆట‌గాడు చేరిపోయాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌దుల్లా రియాద్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.

టీ20 ప్రపంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్ ఓటమి అనంత‌రం క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్ సూప‌ర్ 8 ద‌శ నుంచి నిష్ర్క‌మించింది. సూప‌ర్ 8లో ఆడిన మూడు మ్యాచుల్లో ఓడిపోయి ఇంటిదారి ప‌ట్టింది. ఈ క్ర‌మంలో మ‌హ్మ‌దుల్లా రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

Team India : భార‌త్‌ను వెంటాడుతున్న వ‌రుణుడు.. వాంఖడే స్టేడియంలో టీమ్ఇండియాకు స‌న్మానం.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ..

2007లో శ్రీలంక పై మ్యాచ్ ద్వారా మ‌హ్మ‌దుల్లా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. త‌న 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో బంగ్లాదేశ్ త‌రుపున 50 టెస్టులు, 232 వ‌న్డేలు, 138 టీ20 మ్యాచులు ఆడాడు. 50 టెస్టుల్లో 2914 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 సెంచ‌రీలు 16 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 232 వ‌న్డేల్లో 5386 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు 28 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక 138 టీ20ల్లో 2394 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లోనూ మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 150 పైగా వికెట్లు ప‌డ‌గొట్టాడు.

2018లో జ‌రిగిన నిదాహాస్ ట్రోఫీలో మ‌హ్మ‌దుల్లా సార‌థ్యంలోనే బంగ్లాదేశ్ ఫైన‌ల్‌కు చేరుకుంది. అయితే.. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆట‌గాడు దినేశ్ కార్తీక్ సంచ‌ల‌న బ్యాటింగ్‌తో భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు.

Rishabh Pant : చాలు చాలు లే.. మా ద‌గ్గ‌ర ఉంది లేవోయ్‌.. పంత్‌ను ట్రోల్ చేసిన అక్ష‌ర్‌, సిరాజ్‌..

ట్రెండింగ్ వార్తలు