Platform Ticket: సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.50 పెంపు

ప్రయాణికుల రద్దీని నియంత్రించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Platform Ticket : ప్రయాణికుల రద్దీని నియంత్రించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్‌ఫాం చార్జీలను 10రూపాయల నుంచి 50రూపాయలు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పెంచినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది రైల్వేశాఖ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా మరో 14 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచింది దక్షిణ మధ్య రైల్వే.

ఇదే సమయంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల్, భద్రాచలం రోడ్, వికారాబాద్ ,తాండూర్, బీదర్ పార్లి వైజ్యానాథ్, బేగంపేట్ ‌లలో పది రూపాయలు ఉన్న టికెట్ ధరను 20రూపాయలకు పెంచింది రైల్వేశాఖ. అయితే, పెంచిన ఛార్జీలు తాత్కాలికమేనని ప్రకటించింది రైల్వేశాఖ.

 

ట్రెండింగ్ వార్తలు