Digvijaya Singh : ప్రధాని మోదీ గొప్ప ఈవెంట్ మేనేజ‌ర్.. ఆయన గురించి ఇంకేం చెబుతాం : దిగ్విజయ్ సింగ్ సెటైర్లు

మోదీ తీరు రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా ఉంది. మణిపూర్ మండిపోతుంటే మోదీ అమెరికా పర్యటనలో యోగాసనాలు చేస్తు బిజీగా ఉన్నారు.

Digvijaya Singh Modi US Yoga

Digvijaya Singh : మణిపూర్ (Manipur) అల్లర్లతో అట్టుడిపోతుంటే ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) మాత్రం అమెరికా (America) పర్యటనలో యోగాసనాలు (Yoga) వేస్తున్నారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మండిపడ్డారు. మోదీ తీరు ఎలా ఉందంటే రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఉందని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని న్యూయార్క్ (New York)లో ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా కార్యక్రమానికి నాయకత్వం వహించారు. దీనిపై దిగ్విజయ్ సింగ్ సెటైర్లు వేశారు.

పాకిస్థాన్ కు చెందిన లష్కరే ఉగ్రవాది (Pakistan-based Lashkar-e-Taiba terrorist), 2008 ముంబై దాడుల నిందితుడు (2008 Mumbai attacks accused) సాజిత్ మిర్ (Sajid Mir)ను గ్లోబల్ టెర్రరిస్టు(global terrorist)గా ప్రకటించే ప్రతిపాదనను చైనా (China) అడ్డుకుంటుంటే మోదీ మాత్రం విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. మణిపూర్ అల్లర్లలో 100 మంది పైగా ప్రాణాలు కోల్పోయారని.. కానీ మోదీకి అవేమీ పట్టవని కనీసం రాష్ట్రంలో పర్యటించలేదంటూ విమర్శించారు. ఇప్పటికీ మణిపూర్ లో పరిస్థితులు అదుపులోకి రాలేదు కానీ మోదీ మాత్రం యోగాలు.. విదేశీ పర్యటల్లో మునిగితేలుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

karnataka : SI కి ట్రాన్స్‌ఫర్ .. ఆయన కూతురికి స్టేషన్ బాధ్యతలు

మోదీ తొమ్మిదేళ్ల పాలన (modi nine years rule) గురించి దేశమంతా కార్యక్రమాలు నిర్వహిస్తోంది కానీ మోదీ పాలనలో ఏం సాధించారు? అంటూ  ప్రశ్నించారు. పేలవమైన పాలనకు ఉత్సవాలా? అంటూ ఎద్దేవా చేశారు. మోదీ పాలనకు తనకు తానే మార్కెటింగ్ చేసుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. అద్వానీ (lk advani ) చెప్పిన‌ట్టు మోదీ గొప్ప ఈవెంట్ మేనేజ‌ర్ అంటూ దిగ్విజ‌య్ ఎద్దేవా చేశారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తనను తాను ప్రమోట్ చేసుకోవటం మినహాయించి అన్ని రంగాల్లోను విఫలమయ్యారని విమర్శించారు. మ‌ణిపూర్ మండుతుంటే ప్ర‌పంచ పర్యటనకు బ‌య‌లు దేరిన ప్ర‌ధాని గురించి ఏం చెబుతామ‌ని మ‌రో ట్వీట్‌లో దిగ్విజ‌య్ సింగ్ ప్ర‌శ్నించారు.

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం (international yoga day) సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ బుధ‌వారం (జూన్ 21) న్యూయార్క్‌లోని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్రధాన కార్యాల‌యంలో యోగా వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 180 దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో యోగా సెషన్ లో అత్యధిక జాతీయులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు సాధించింది.

Kerala : విడాకుల విషయంలో కోర్టు తీర్పుపై ఆగ్రహం.. ఏకంగా జడ్జి కారునే ధ్వంసం చేసిన వ్యక్తి

ట్రెండింగ్ వార్తలు