PM Modi in Metro: ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమానికి మెట్రోలో వెళ్లిన ప్రధాని మోదీ

ప్రధాని పాల్గొనబోయే యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రధాని కార్యక్రమం జరిగే సమయంలో 10 గంటల నుంచి 12 గంటల మధ్య తరగతులు నిలిపివేస్తారని యాజమాన్యం చెప్పింది

Delhi University Event: ఢిల్లీ యూనివర్సిటీలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న మోదీ.. తోటి ప్రయాణికులతో కూర్చొని, వారితో సంభాషిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. ఇక ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. క్యాంపస్ పరిధిలో మూడు భవనాల నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కాఫీ టుబుల్ పుస్తకాలను విడుదల చేస్తారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Shah criticize Rahul: మోదీకి 20 సార్లు ఫెయిల్ అయిన రాహుల్ గాంధీ పోటీయేంటి? అమిత్ షా సెటైర్లు

మోదీ శంకుస్థాపన చేసే భవనాలు.. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన టెక్నాలజీ ఫ్యాకల్టీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్‌ల కోసం నిర్మించబోతున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. ఇక ప్రధాని పాల్గొనబోయే యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రధాని కార్యక్రమం జరిగే సమయంలో 10 గంటల నుంచి 12 గంటల మధ్య తరగతులు నిలిపివేస్తారని యాజమాన్యం చెప్పింది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఈ కర్యక్రమంలో పాల్గొనాలని, ఎవరూ నల్ల దుస్తులు వేసుకురాకూడదని ఆదేశాలు ఇచ్చారు.

Hyderabad : ముంబై, ఢిల్లీని తలదన్నేలా హైదరాబాద్.. ఇండియాలోనే సూపర్ సిటీగా మారనున్న భాగ్యనగరం

ఇక ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరుకానున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 360 మంది విద్యార్థుల సామర్థ్యంతో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టింది. కొత్తగా నిర్మించబోయే భవనంలో ఈ గ్రూపుకు ఒకటి కేటాయిస్తారు. ఇక ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 1,000 మందికి పైగా పారామిలటరీ, పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు మూడు టైర్ల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు