Adipurush : ఆదిపురుష్ సెకండ్ డే కలెక్షన్స్ జోరు.. టాక్ ఎలా ఉన్నా 100 కోట్లకు ఏమాత్రం తగ్గడం లేదు..

ప్రభాస్ ఆదిపురుష్ టాక్ ఎలా ఉన్నా గాని కలెక్షన్స్ లో మాత్రం జోరు తగ్గడం లేదు. మొదటి రోజు 100 కోట్లకు పైగా అందుకున్న ఈ మూవీ సెకండ్ డే కూడా..

Prabhas Kriti Sanon Adipurush collections report in telugu

Prabhas Adipurush : రాముడిగా ప్ర‌భాస్‌(Prabhas), సీత‌గా కృతి స‌న‌న్(Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) న‌టించిన సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా రామాయణం కథాంశంతో రావడంతో దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. దీంతో సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. జూన్ 16న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

Adipurush Controversy : ఆదిపురుష్‌లోని డైలాగ్స్‌పై మండిప‌డ్డ ముఖ్య‌మంత్రి.. ప్ర‌జ‌లు కోరితే రాష్ట్రంలో సినిమాని నిషేదిస్తాం

ఇక మొదటిరోజు భారీ నెగటివిటీని ఎదురుకోవడంతో మూవీ కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని అందుకున్నారు. కానీ రెండో రోజు కూడా ఈ మూవీ కలెక్షన్స్ ఏమాత్రం జోరు తగ్గడం లేదు. సెకండ్ డే కూడా ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. రెండు రోజులు పూర్తి అయ్యేపాటికీ ఈ సినిమా 240 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. మరి ఆదివారం ఏ రేంజ్ కలెక్షన్స్ ని అందుకొని మొదటి వీకెండ్ ని ఎలా ముగిస్తుందో చూడాలి. ప్రస్తుతం మూవీ పై కూడా కొంచెం పాజిటివ్ టాక్ బయటకి వస్తుంది.

Adipurush : ఆదిపురుష్ హనుమాన్ డైలాగ్స్ పై వివాదం.. నేనేమి తప్పుగా రాయలేదు అంటూ స్పందించిన రైటర్..

ఇదే టాక్ పెరుగుతూ వెళితే మూవీ కలెక్షన్స్ కూడా మరో వారం పాటు ఇదే రేంజ్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు. కాగా ఈ సినిమా మొదటిరోజు 100 కోట్లకు పైగా కలెక్షన్ స్ అందుకోవడంతో ప్రభాస్ సరికొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. ప్రభాస్ గత సినిమాలు బాహుబలి 2, సాహూ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం కూడా 100 కోట్ల మార్క్ క్రాస్ చేయడంతో.. మూడు సినిమాలతో ఇండియాలోనే ఏకైక హీరోగా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు