Radhe Shyam : ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా ట్రాఫిక్ జామ్..

భారీగా తరలివస్తున్న ప్రభాస్ అభిమానులతో రామోజీ ఫిలిం సిటీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది..

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. దాదాపు మూడు సంవత్సరాలుగా ‘రాధే శ్యామ్’ సినిమా కోసం పనిచేస్తున్నాడు డార్లింగ్. ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కి రెడీ అయిపోయింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ ప్రంపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!

డిసెంబర్ 23న రామోజీ ఫిలిం సిటీలో అంగరంగవైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చాలా గ్యాప్ తర్వాత తమ అభిమాన నటుణ్ణి చూడబోతుండడంతో భారీ సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ఎఫ్‌సీకి చేరుకున్నారు. వారిని అదుపు చెయ్యడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.

RRR Movie : కపిల్ శర్మ షో లో ‘ఆర్ఆర్ఆర్’ టీం!

కాలి నడకన అలాగే వాహనాల్లో తరలి వస్తున్న ప్రభాస్ అభిమానులతో ఫిలిం సిటీ బయట, లోపల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గతంలో ‘బాహుబలి’ ఫంక్షన్ అప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో డార్లింగ్ రామోజీ ఫిలిం సిటీకి రాబోతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు