Rahul Gandhi: మోదీ గారికి ధన్యవాదాలు, ఉద్యోగాలపై 45 కోట్ల మంది ఆశలు కోల్పోయారు: మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

గత ఐదేళ్లలో దేశంలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని, 45 కోట్ల మంది ప్రజలు ఉద్యోగం కోసం వెతకడం మానేశారని ఒక వార్తా నివేదికను రాహుల్ ఉదహరించారు

Rahul Gandhi: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్స్ కారణంగా 45 కోట్ల మందికి పైగా ప్రజలు ఉద్యోగాలపై ఆశలు కోల్పోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. 75 ఏళ్లలో ఇలాంటివి చేసిన తొలి ప్రధాని మోదీ అని రాహుల్ విమర్శించారు. “దేశం యొక్క కొత్త నినాదం “ప్రతి ఇంట్లో నిరుద్యోగం ఉంది” 75 ఏళ్లలో 45 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందాలనే ఆశను కోల్పోయేలా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మాస్టర్ స్ట్రోక్స్ ఇచ్చారని అందుకు ఆయనకు ధన్యవాదాలు అంటూ రాహుల్ వ్యంగ్యంగా హిందీలో ట్వీట్ చేశారు.

Also Read:Tesla Cars in India: భారత్ లో అమ్మండి, కానీ చైనా నుంచి ఇక్కడికి తీసుకురాకండి: టెస్లా కంపెనీకి కేంద్ర మంత్రి గడ్కరీ సూచన

గత ఐదేళ్లలో దేశంలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని, 45 కోట్ల మంది ప్రజలు ఉద్యోగం కోసం వెతకడం మానేశారని ఒక వార్తా నివేదికను రాహుల్ ఉదహరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఎస్ఈ బోర్డులో 10, 12 తరగతుల సిలబస్ ను మార్చుతూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 11, 12 తరగతుల హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి “ఆఫ్రో-ఆసియా భూభాగాల్లో ఇస్లామిక్ సామ్రాజ్యాల ఆవిర్భావం, మొఘల్ కోర్టుల చరిత్రలు, ప్రచ్ఛన్న యుద్ధం, పారిశ్రామిక విప్లవం” వంటి అధ్యాయాలను తొలగిస్తూ సోమవారం సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Also read:Navneet Rana: పోలీసులపై నవనీత్ ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన కమిషనర్

దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) తీరుపై విరుచుకుపడ్డారు. సిబిఎస్ఇ అంటే ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అణిచివేత విద్య’ అంటూ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. పాఠ్యాంశాల్లో సిలబస్ మార్పుపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను లక్ష్యంగా చేసుకున్న రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ అంటే ‘రాష్ట్రీయ శిక్షా శ్రేద్దర్’ అంటూ సంబోదించాడు. భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్న సంస్థలను మనం రక్షించాలంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also read:Bombay High Court: ప్రయాణికుల రద్దీ కారణంగా రైలులోంచి పడి వ్యక్తి గాయపడితే రైల్వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందే: బాంబే హైకోర్టు

ట్రెండింగ్ వార్తలు