Ramesh Babu : ముగిసిన ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు

ఉదయం పద్మాలయ స్టూడియోస్ లో రమేశ్ బాబు భౌతిక కాయాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు రమేశ్ బాబుకి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ.....

Ramesh Babu :  సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు నిన్న సాయంత్రం మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Nagarjuna : ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో 6గురు.. ‘బంగార్రాజు’ సినిమాలో 8మంది హీరోయిన్స్

ఇవాళ ఉదయం పద్మాలయ స్టూడియోస్ లో రమేశ్ బాబు భౌతిక కాయాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు రమేశ్ బాబుకి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్ లో రమేశ్ బాబు భౌతిక కాయాన్ని ఉంచారు. ఆ తర్వాత పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానానికి రమేశ్ బాబు అంతిమయాత్ర జరిగింది. జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో రమేష్ బాబు చితికి కుమారుడు జయకృష్ణ నిప్పుపెట్టారు. ఘట్టమనేని రమేశ్ బాబు అంత్య క్రియలు కోవిడ్ నిబంధనలతో అతి కొద్దిమందితో ముగిశాయి.

ట్రెండింగ్ వార్తలు