Realme 9i 5G : రియల్‌మి యూజర్లకు అద్భుతమైన ఆఫర్.. రూ.15,999 విలువైన రియల్‌మి 9i 5G ఫోన్ కేవలం రూ. 599కే సొంతం చేసుకోవచ్చు!

Realme 9i 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రిలీజ్ అయిన రియల్‌మి 9i 5G ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Realme 9i 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రిలీజ్ అయిన రియల్‌మి 9i 5G ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో Realme 9i 5G సరసమైన ధరకే లభ్యమవుతోంది. బడ్జెట్‌లో ఫీచర్లతో వచ్చిన ఈ 9i 5Gని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశం.. మీరు Flipkart నుంచి రూ. 1,000 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ. 1,000 కన్నా తక్కువకు ఎలా పొందాలంటే?
రియల్‌మి 9i 5G ఫోన్.. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీ డివైజ్ గరిష్ట రిటైల్ ధర (MRP) రూ. 15,999గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు 31.25శాతం వద్ద రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో పాటు, కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అంటే.. మీరు ఇన్‌కమింగ్ ఫోన్ కోసం పాత హ్యాండ్‌సెట్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also Realme 10 5G Launch in India : రియల్‌మి 10 సిరీస్ 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

కస్టమర్ పొందే గరిష్ట ఎక్స్ఛేంజ్ విలువ రూ.10,400 వరకు ఉంటుంది. దాంతో మీరు రియల్‌మి 9i 5Gని కేవలం రూ. 599 ధరకు సొంతం చేసుకోవచ్చు. అసలు ఈ ఫోన్ MRP ధరపై 99శాతం తగ్గింపు పొందవచ్చు. అయితే, మీ పాత హ్యాండ్‌సెట్‌పై ఎక్స్ఛేంజ్ వాల్యూపై తగ్గింపు ధర ఆధారపడి ఉంటుందని గమనించాలి.

Realme’s 9i 5G, with MRP Rs. 15,999, can be yours for Rs. 599.

రియల్‌మి 9i 5G ఫీచర్లు ఇవే :
ఈ ఫోన్ 6.6-అంగుళాల Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 90 Hzగా ఉంది. ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో క్వాల్‌కామ్ అడ్రినో 610 GPUతో వచ్చింది. ఆపరేటింగ్ సిస్టమ్ (OS), ఈ డివైజ్ Android 11-ఆధారిత Realme UI 2.0ని పొందుతుంది. ఫోటోగ్రఫీ కోసం.. LED ఫ్లాష్‌తో వెనుకవైపు 50 MP ప్రైమరీ సెన్సార్, ట్విన్ 2 MP కెమెరాలతో వచ్చింది. ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP కెమెరా ఉన్నాయి. 5,000 mAh బ్యాటరీతో పాటు 33 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme GT Neo 5 Phone : జనవరి 5న రియల్‌మి GT Neo 5 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు