RRR: అన్‌స్టాపబుల్ కలెక్షన్లు.. ఇండియన్ సినిమా అడ్రెస్ మార్చేస్తున్న ఆర్ఆర్ఆర్!

ట్రిపుల్ ఆర్ జస్ట్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా బ్రాండ్. అవును ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో తెరకెక్కించిన ట్రిపుల్ఆర్ వెయ్యి కోట్ల కలెక్షన్లతో సరికొత్త..

RRR: ట్రిపుల్ ఆర్ జస్ట్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా బ్రాండ్. అవును ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో తెరకెక్కించిన ట్రిపుల్ఆర్ వెయ్యి కోట్ల కలెక్షన్లతో సరికొత్త రికార్డులు సెట్ చేస్తోంది. రిలీజ్ అయిన ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతూ.. అన్ స్టాపబుల్ రివ్యూస్ తో హయ్యస్ట్ కలెక్టెడ్ మూవీస్ లో చోటు దక్కించుకుంది.

RRR: ఆర్ఆర్ఆర్ 12 రోజుల వసూళ్లు.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో!

తెలుగు సినిమా స్తాయిని, స్తానాన్ని మార్చేసింది ట్రిపుల్ఆర్ మూవీ. గ్రాండ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన టాలీవుడ్ నుంచి వచ్చిన ట్రిపుల్ఆర్ మూవీ ఇండియన్ సినిమాకి కేరాఫ్ అడ్స్ అయిపోయింది. 500 కోట్ల బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా 12 రోజుల్లో అన్ స్టాపబుల్ గా వెయ్యి కోట్ల కలెక్షన్లతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లబ్ ఎంట్రీకి రెడీ అయ్యింది.

RRR : ముంబైలో చరణ్, తారక్‌లకు సన్మానం.. గెస్ట్‌గా అమీర్ ఖాన్??

11 వేలకు పైగా థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ట్రిపుల్ఆర్ గురించి పాన్ వరల్డ్ వైడ్ గా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. వెయ్యి కోట్ల కలెక్షన్లకు దగ్గరైతే కానీ.. పార్టీ మూడ్ లోకి రాలేదు ట్రిపుల్ఆర్ టీమ్. రిలీజ్ అయిన 12 రోజుల తర్వాత ట్రిపుల్ ఆర్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు ఆర్ఆర్ఆర్ టీమ్ అందరూ. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ఫ్యామిలీస్ తో పాటు మెయిన్ స్టార్ కాస్ట్ అంతా అటెండ్ అయ్యి సక్సెస్ పార్టీలో తెగ సందడి చేశారు.

RRR: ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల వరద.. టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ

సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌ లో అడ్వాన్స్ బుకింగ్‌ బిజెనెస్‌ టార్గెట్ ను మించి అయ్యింది. సినిమా రిలీజ్ తర్వత కూడా మంచి కలెక్షన్లను అందుకుంటోంది. అయితే నార్త్ ఇండియా ఆడియన్స్ లో స్టార్టింగ్ రెస్పాన్స్ కాస్త తగ్గినట్టు కనిపించినా.. నెమ్మదిగా పికప్ అయ్యి.. అక్కడ కూడా రికార్డులు సెట్ చేస్తోంది.

RRR : IMDB వరల్డ్ టాప్ 5 సినిమాలలో ‘ఆర్ఆర్ఆర్’.. రేటింగ్‌లో నంబర్ 1

ట్రిపుల్ఆర్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా నెవర్ బిఫోర్ కలెక్షన్లు సాధిస్తోంది. బాలీవుడ్ లో పాండమిక్ తర్వాత 200 కోట్లు కలెక్ట్ చేసిన రెండో మూవీగా ట్రిుపుల్ ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా అమీర్ ఖాన్ ఆల్ టైమ్ కలెక్టెడ్ మూవీ పీ.కే 900 కోట్ల కలెక్షన్ల మార్క్ ని క్రాస్ చేసి బాలీవుడ్ స్టార్ల రికార్డులు కూడా తుడిచిపెడుతోంది.

RRR: ఆర్ఆర్ఆర్ మేనియా.. జక్కన్నపై కంగనా పొగడ్తల వర్షం!

నేచర్‌ లో పవర్ ఫుల్‌ ఎలిమెంట్స్ నీరు, నిప్పు మధ్య దోస్తీ అనే కాన్సెప్ట్ తో.. నెవర్ బిఫోర్ రేంజ్ ప్రమోషన్స్ తో ఆల్ ఓవర్ ఇండియా ఆడియన్స్ లో విపరీతమైన హైప్‌ క్రియేట్‌ చేసి దాన్ని కలెక్షన్లుగా మార్చడంలో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యారు రాజమౌళి. థియేట్రికల్‌, డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్ పరంగా దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా వెయ్యి కోట్ల కలెక్షన్ల క్రాస్ చేసింది ఆర్ఆర్ఆర్.

ట్రెండింగ్ వార్తలు