RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా గత మూడేళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అత్యంత భారీ స్థాయిలో రిలీజైన ఆర్ఆర్ఆర్ వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్ క్యాస్ట్, రాజమౌళి విజువలైజేషన్ ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
RRR: నేపాల్‌లో దుమ్ములేపుతున్న ఆర్ఆర్ఆర్!
అక్కడక్కడా రాజమౌళి మార్క్ ఇంకేదో కావాలని మిక్సెడ్ టాక్ మినహా.. తొలిరోజే ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతోంది. హిందీలో ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లు పైనే వసూలు చేసి రూ.వెయ్యి కోట్ల దిశగా వెళ్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ మానియానే కనిపిస్తోండగా.. ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రెటీలు వరకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
RRR: తగ్గని జోరు.. హిందీలో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఆర్ఆర్ఆర్!
తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ, జక్కన్నపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించింది. ‘ఎప్పటికీ రాజమౌళి సార్ భారతీయ చలచిత్రాల గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కెరీర్లోనే ప్లాప్ సినిమాలు లేవు, ఇక భవిష్యత్తులో కూడా ఉండవు’ అని పేర్కొంది. అలాగే మరో రెండు పోస్ట్‌లలో కూడా రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాను తెగ ప్రశంసించింది.
RRR: బాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ నెంబర్ ఆరు!
‘ఇక్కడ ఆయన గురించి చెప్పుకునే మరో విషయం ఏమిటంటే. రాజమౌళి గారు ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న గొప్ప మనిషి. దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది. మీలాంటి రోల్ మోడల్ ఉండటం అదృష్టం సార్. నిజాయితిగా నేను మీకు పెద్ద అభిమానిని’ అంటూ కంగనా రాసుకొచ్చింది. అంతేకాదు రేపు కుటుంబంతో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీకి వెళ్తున్నానని, మరి మీరేప్పుడు చూస్తారు? అని మరో స్టోరీలో పేర్కొంది.