Pushpa Song : పుష్ప 2 నుంచి రెండో సాంగ్ ప్రోమో వచ్చేసింది.. శ్రీవల్లి వదిన సాంగ్ తెచ్చేస్తుంది..

తాజాగా పుష్ప 2 రెండో సాంగ్ ప్రోమో విడుదల చేశారు

Pushpa Song : అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా రెండో సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే కేశవా వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా ఆ పాటేందో చెప్తావా అని అడగ్గా రష్మిక.. సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. అని పాడింది. మీరు కూడా ప్రోమో చూసేయండి.

ఇక ఈ రెండో సాంగ్ ని మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది బన్నీ, రష్మిక కపుల్ సాంగ్ అని తెలిపారు. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ అభిమానులు పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు