Sarkaru Vaari Paata: ప్రమోషన్లు షురూ.. రంగంలోకి దిగనున్న మహేష్!

సూపర్ స్టార్ సినిమా అంటే.. ప్రమోషన్ కూడా సూపర్ గానే ఉండాలి. సినిమా రిలీజ్ కు ఇంకా 2 వారాలపైనే ఉంది. ఇంకా ట్రైలర్ రిలీజ్ కానేలేదు.. అసలు అన్నీ దగ్గరుండి చూస్కోవాల్సిన హీరో అసలు ఊళ్లోనే లేరు. అయినా సరే.. తగ్గేదే లే అంటోంది సినిమా మీద హైప్.

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ సినిమా అంటే.. ప్రమోషన్ కూడా సూపర్ గానే ఉండాలి. సినిమా రిలీజ్ కు ఇంకా 2 వారాలపైనే ఉంది. ఇంకా ట్రైలర్ రిలీజ్ కానేలేదు.. అసలు అన్నీ దగ్గరుండి చూస్కోవాల్సిన హీరో అసలు ఊళ్లోనే లేరు. అయినా సరే.. తగ్గేదే లే అంటోంది సినిమా మీద హైప్. ఎక్కడా ఆగేదే లే అంటున్నాయి సినిమా ప్రమోషన్లు. మరి సర్కారు వారి పాట ప్రమోషన్ల స్కెచ్ ఏంటో మనం కూడా చూద్దాం.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్..?

మహేష్ సినిమా మంచి ఊపు మీదుంది. సర్కారు వారి పాట స్పీడ్ ఏమాత్రం తగ్గనంటోంది. మహేష్ బాబు మాస్ ర్యాంపేజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ట్రీట్ రెడీ చేస్తూ.. సినిమా మీద హైప్స్ పెంచేస్తోంది టీమ్. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర టైనర్ సర్కారు వారి పాట బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ డిఫరెంట్ సాంగ్స్ రిలీజ్ చేసిన టీమ్.. ఈ సారి కంప్లీట్ మాస్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతు్న్నారు. ఈ సాంగ్ కు సంబంధించి ఫైనల్ కట్ చూశానని మెంటల్ మాస్ సాంగ్ మీ కోసమే రెడీ అవుతోందని ట్వీట్ చేసి అటు సాంగ్ మీద త్వరలో రిలీజ్ అవుతున్న టీజర్ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు థమన్. సర్కార్ వారి పాట సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న థమన్.. సినిమా ఓ బ్లాక్ బస్టర్ అని ముందే ప్రమోట్ చేస్తున్నాడు.

Sarkaru Vaari Paata: టైటిల్ సాంగ్‌తో పైసా వసూల్ చేస్తున్న మహేష్!

సర్కారు వారి పాట సినిమా కోవిడ్ వల్ల లేట్ అయినా.. సంక్రాంతి నుంచి రిలీజ్ సమ్మర్ కి షిఫ్ట్ అయినా సినిమా మీద అంచనాలు ఇంచ్ కూడా తగ్గకుండా చూసుకుంటున్నారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి పోస్టర్లు, వీడియోలతో ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇక పాటల విషయంలో అయితే ఓ అడుగు ముందే ఉన్నారు. టైమ్ చూసుకుని అప్పుడొక పాట అప్పుడొక పాట రిలీజ్ చేస్తూ.. ప్రమోషన్లను స్పీడప్ చేస్తూనేఉన్నారు. రిలీజ్ చేసిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. అందులో క్యూట్ కళావతి సాంగ్ అయితే ఏకంగా 15 కోట్లు వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్ తోనే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన సర్కారు వారి పాట ఇక ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫాన్స్.

Sarkaru Vaari Paata: సర్కారు పోస్ట్‌పోన్ రూమర్స్.. మాట తప్పేది లేదన్న మేకర్స్!

మే 12 సినిమా రిలీజ్ కు ఇంకా 2 వారాల టైముంది. మరో వైపు ఆచార్య కూడా రిలీజ్ కు రెడీ అయిపోయాడు కాబట్టి.. ఆచార్య రిలీజ్ అవ్వడంతోనే సర్కారు వారి పాట ప్రమోషన్లను పీక్స్ లో చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మహేష్ అండ్ కో. మహేష్ ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకుని పారిస్ లో రిలాక్స్ అవుతున్నారు. మరో వారంలో మహేష్ ఇండియాకి తిరిగొచ్చేసరికి సినిమాని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి డిజిటల్ ప్రమోషన్ల నుంచి డైరెక్ట్ ప్రమోషన్లలోకి దిగుదామని ప్లాన్ చేస్తున్నారు టీమ్.

ట్రెండింగ్ వార్తలు