TS Politics : పోలవరం ప్రాజెక్టుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా?

సీఎం జగన్ ను ఇంటికి పిలించి స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా? అంటూ పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

Sharmila criticizes TRS govt on Polavam project : టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ అధినేతి వైఎస్ షర్మిల. భద్రాచలం వరదలో ముంపుకు కారణం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవటమే కారణం అని భద్రాచలం గోదావరి కరకట్ట ఎత్తు పెంచకపోవటమే కారణం అంటూ షర్మిల ఆరోపించారు.వెంటనే గోదావరి కరకట్ట ఎత్తు పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు..తెలంగాణలో పార్టీ పెట్టిన ఇన్నాళ్లలో తన అన్న జగన్ గురించి ఒక్క మాటకూడా ఎత్తని షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్ కు మధ్య ఉన్న సమన్వయం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

భద్రాచలానికి వరద ముప్పుకు కారణం ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టే కారణం అని తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విమర్శలపై షర్మిల మండిపడ్డారు. గతంలో పోలవరం ప్రాజెక్టును మెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు పోలవం గురించి విమర్శలు చేయటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. భద్రాచలం ముంపుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణమైతే ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు అని..పక్క రాష్ట్ర సీఎం (జగన్మోహన్ రెడ్డి)ని ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం మునిగిపోతుందని అప్పుడు తెలియదా? అంటూ ఎద్దేవా చేస్తు ప్రశ్నించారు.

భద్రాచలం ముంపుని నియంత్రించటానికి..తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా..ప్రజలకు సహాయం చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలవరం ప్రాజెక్టును బూచిగా చూపించి టీఆర్ఎస్ ప్రభుత్వం సాకులు చెబుతోంది అంటూ విమర్శించారు షర్మిల. వరద బాధితులకు ఒక్కరూపాయి సహాయం చేయకుండా వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది అంటూ విమర్శలు సంధించారు షర్మిల.

 

ట్రెండింగ్ వార్తలు