Smriti Irani: అటువంటి పార్టీతో రాహుల్ గాంధీ కలుస్తున్నారు: స్మృతీ ఇరానీ

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఇవాళ స్మృతీ ఇరానీ మీడియాతో మాట్లాడారు.

Smriti Irani

Smriti Irani – Rahul Gandhi: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో పంచాయతీ ఎన్నికల (panchayat election) వేళ చోటుచేసుకున్న ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇంతటి హింసకు కారణమవుతున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC)తో కాంగ్రెస్ ఎందుకు పొత్తులు పెట్టుకుంటుందని ఎపం రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఇరానీ నిలదీశారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఇవాళ స్మృతీ ఇరానీ మీడియాతో మాట్లాడుతూ… ” పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల వేళ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలను చంపేస్తున్నారు. ఒకవైపు అటువంటి పరిస్థితులు ఉంటే, మరోవైపు టీఎంసీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతోంది. పశ్చిమ బెంగాల్ లో విధ్వంసాన్ని సృష్టిస్తోన్న వారితో కలవడం సరైనదేనని గాంధీ కుటుంబం భావిస్తోందా? ఈ మృత్యు క్రీడను ఆయన అంగీకరిస్తున్నారా?” అని నిలదీశారు.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరానీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ప్రతిపక్షాల సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.

Eatala Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్​తో ఈటల భేటీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు