Castor Cultivation : ఆముదం సాగులో మెళకువలు

గతంలో దిగుబడులు తక్కువగా వుండి, ఆదాయం నిరాశాజనకంగా వుండటంతో... ఇతర పంటల సాగుకు మొగ్గిన రైతాంగం.. అధిక దిగుబడులిచ్చే అనేక సంకర రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో మళ్ళీ దీనిసాగుకు  ఆసక్తి కనబరుస్తున్నారు.

Castor Oil Cultivation

Castor Cultivation : ఏ పంటా లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని చెబుతారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఆముదం పంట కూడా మంచి వ్యాపార విలువతో ఆశాజనకమైన ఫలితాలను అందిస్తోంది. అందుకు తగ్గట్టుగానే హైబ్రీడ్ రకాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది రైతులు ఆముదం సాగుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఎన్. నళిని.

READ ALSO : Tirumala : తిరుమలలో చిక్కిన చిరుత.. బాలికపై దాడిచేసిన ప్రాంతానికి దగ్గర్లోనే బోనులోకి

నూనెగింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేకస్థానం. బీడు, బంజరు భూముల్లో  సైతం  రైతులు ఆముదాన్ని సాగుచేసి, ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకుంటున్నారు. దీనినుండి వస్తున్న నూనెను వివిధ పరిశ్రమలలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని  ఇండస్ర్టియల్ ఆయిల్  అంటారు. ఖరీఫ్ లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తుంటారు రైతులు.

READ ALSO : Joint Preservation : గుడ్ న్యూస్.. జాయింట్ ప్రిజర్వేషన్‌తో ఇక కీలు మార్పిడికి నో చెబుదాం..!

గతంలో దిగుబడులు తక్కువగా వుండి, ఆదాయం నిరాశాజనకంగా వుండటంతో… ఇతర పంటల సాగుకు మొగ్గిన రైతాంగం.. అధిక దిగుబడులిచ్చే అనేక సంకర రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో మళ్ళీ దీనిసాగుకు  ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వర్షాధారంగా సాగుచేసే రైతులు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, శాస్త్రవేత్త నళిని.

ట్రెండింగ్ వార్తలు