Jammu and Kashmir : పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం…ఉగ్రవాది హతం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి....

Jammu and Kashmir Army

Jammu and Kashmir : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. (Army foils infiltration bid in Poonch) సోమవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ పాక్ ఉగ్రవాది హతం అయ్యాడు.

Kamal Nath : కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సీఎం శివరాజ్ సింగ్‌కు స్వాగతం…మాజీ సీఎం కమల్‌నాథ్ వ్యాఖ్యలు

పూంచ్  జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో అప్రమత్తమైన భద్రతా బలగాలు సోమవారం తెల్లవారుజామున చీకటి ముసుగులో ఇటువైపుకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు ఉగ్రవాదుల కదలికలను గమనించి ఎదురుకాల్పులు జరిపారు. పాకిస్థాన్ వైపు నుంచి నియంత్రణ రేఖలోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత సైనికులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎదురుకాల్పులు జరిపారు.

Cricketer Sarfaraz Khan : కశ్మీరు కన్యతో క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వివాహం

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడికి పాల్పడేందుకు పాక్‌కు చెందిన తీవ్రవాద గ్రూపులు ప్లాన్ చేస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గత కొన్ని గంటల్లో ఇది రెండో చొరబాటు ప్రయత్నం. ఆదివారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.

Morocco : సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా..24 మంది మృతి

కుప్వారాలోని తంగ్‌ధర్ సెక్టార్‌లోని దఖేన్-అమ్రోహి ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దట్టమైన పొదలు, కఠినమైన భూభాగాలను సద్వినియోగం చేసుకొని మరో ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ వైపు వెళ్లి తప్పించుకున్నారని సైనిక ప్రతినిధి తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి కశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నేరస్థుల సామాగ్రిని బట్టి హతమైన ఉగ్రవాది పాకిస్థాన్ జాతీయుడని భావిస్తున్నట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఒక ఏకే రైఫిల్, ఏకే మ్యాగజైన్, 15 ఏకే రౌండ్లు, ఐదు 9 ఎంఎం పిస్టళ్లు, ఒక 15 ఎంఎం పిస్టల్, ఎనిమిది పిస్టల్ మ్యాగజైన్లు, 9 ఎంఎం పిస్టల్, 32 బుల్లెట్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు