Summer Diseases : వేసవిలో సాధారణంగా వచ్చే వ్యాధులు ఇవే!.

వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల ముందుస్తు జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయపరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Summer Diseases : వేసవి కాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో అనేక మార్పులు సంభవించి చివరకు వ్యాధులకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల ముందుస్తు జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయపరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, వడదెబ్బలు, మీజిల్స్, కామెర్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

వేసవిలో వచ్చే వ్యాధులు ;

వడదెబ్బ ; వేసవిలో అధిక ఉఫ్ణోగ్రతల ప్రభావంతో డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎండలో అధిక సమయం గడిపినా వడబెబ్బ తగులుతుంది. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే నీటిని అధిక మొత్తంలో తీసుకోవాలి. నిమ్మరం, కొబ్బరి నీరు, గ్లూజ్ వంటి వాటిని తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే సకాలంలో చికిత్స పొందటం అవసరం. లేకుంటే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎండ అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళటం మానుకోండి.

విషాహారం ; వేసవిలో అధిక వేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని నివారించడానికి, మిగిలిపోయిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ లోపల ఉంచండి. ఆహారం చెడిపోకుండా చూసుకోవాలంటే ఆహారాన్ని బాగా ఉడికించాలి.

చర్మ సమస్యలు ; అధిక తేమ, వేడి కారణంగా చర్మంపై ఎరుపు దద్దుర్లు. స్వేద గ్రంథులు మూసుకుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. చెమట వల్ల మచ్చలు , దురద, మంట వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్లు ఉపయోగించండి.

అతిసారం ; ఎండవేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకుంటే వేసవిలో విరేచనాలు సాధారణం. కలుషిత ఆహారం తినడం ,మద్యపాన అలవాట్లు డయేరియాకు దారితీస్తాయి. అతిసారం నుండి దూరంగా ఉండటానికి, నీటిని మరిగించిన తర్వాత మాత్రమే త్రాగటం అలవాటుగా మార్చుకోవాలి. కూరగాయలను ముక్కలు చేయడానికి ముందు, తర్వాత వాటిని బాగా కడగాలి.

అమ్మోరు ; చికెన్‌పాక్స్ చాలా సాధారణ వేసవి వ్యాధులలో ఒకటి. ఇది అధిక జ్వరంతో శరీరంపై ఎరుపు రంగులో ఉండే చిన్న దద్దుర్లు రూపంలో ప్రారంభమవుతుంది. ఇది పిల్లలలో , తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి.

తట్టు ; మీజిల్స్ మరో సాధారణ వేసవి వ్యాధి. మీజిల్స్‌కు కారణమయ్యే పారామిక్సోవైరస్ వేసవిలో వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు దగ్గు, అధిక జ్వరం, గొంతు నొప్పి , కళ్ళు ఎర్రబడటం. తరువాతి దశలో, చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీజిల్స్ దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి.

కామెర్లు ; కామెర్లు నీటి ద్వారా సంక్రమించే సాధారణ వ్యాధి. ఇది హెపటైటిస్ A వల్ల వస్తుంది. ప్రధానంగా కలుషితమైన ఆహారం , నీటి వినియోగం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి కాలేయం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది, ఇది పిత్తం అధిక ఉత్పత్తికి దారితీస్తుంది.

టైఫాయిడ్ ; టైఫాయిడ్ ఆరోగ్యకరమైన వ్యక్తులకు నోరు ,మల మార్గం ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి వనరులు బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారతాయి. టైఫాయిడ్ వస్తే బలహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపులో నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గవదబిళ్ళలు ;వేసవి వ్యాధులలో, గవదబిళ్ళలు మరొక అత్యంత అంటువ్యాధి. ఈ వైరల్ వ్యాధి పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది. లాలాజల గ్రంథి వాపు, కండరాల నొప్పి, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చెమటతోపాటు శరీరంలో ఉండే పొటాషియం, సోడియం, క్లోరైడ్, పాస్పరస్‌ వంటి లవణాలు కూడా బయటకు పోతాయి. ఇవి తిరిగి శరీరంలోకి చేరాలంటే తప్పకుండా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగాలి. వడదెబ్బ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే చక్కెర, ఉప్పు కలిసిన నీరు తాగాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చలికాలంలో వచ్చే వైరస్‌ల కంటే వేసవిలో వచ్చే వైరస్ లు ప్రమాదకరమైనవని గ్రహించాలి.

ట్రెండింగ్ వార్తలు