Duleep Trophy : ప్ర‌త్య‌ర్థి విజ‌యాన్ని అడ్డుకునేందుకు.. 5.3 ఓవ‌ర్లు వేసేందుకు 53 నిమిషాలు.. క్రీడాస్పూర్తిపై మొద‌లైన చ‌ర్చ‌

ఆట‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఒక్కొసారి ఓట‌మి పాలు కావొచ్చు. మ‌రోసారి అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఏదీ ఏమైనా మ్యాచ్ గెలిచేందుకు చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేదు. అలాగ‌ని క్రీడాస్పూర్తికి విరుద్దంగా ఆడ‌కూడ‌దు.

Duleep Trophy

Duleep Trophy semi final : ఆట‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఒక్కొసారి ఓట‌మి పాలు కావొచ్చు. మ‌రోసారి అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఏదీ ఏమైనా మ్యాచ్ గెలిచేందుకు చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేదు. అలాగ‌ని క్రీడాస్పూర్తికి విరుద్దంగా ఆడ‌కూడ‌దు. ప్ర‌త్య‌ర్థి దూకుడుగా ఆడుతూ విజ‌యానికి చేరువైన త‌రుణంలో వ‌ర్షం మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాగా.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు విజ‌యం సాధించ‌కుండా ఉండేందుకు కావాల‌ని ఓవ‌ర్ల‌ను చాలా ఆల‌స్యంగా వేశారు. 5 ఓవ‌ర్లు వేసేందుకు దాదాపు 53 నిమిషాలు తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న దులీప్ ట్రోఫీలో సెమీఫైన‌ల్‌లో చోటు చేసుకుంది. నార్త్‌జోన్ బౌల‌ర్లు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది.

దులీప్ ట్రోఫీ సెమీఫైన‌ల్‌లో భాగంగా నార్త్‌జోన్‌, సౌత్ జోన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. నార్త్ జోన్ 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో సౌత్ జోన్ 183/4 (30.2 ఓవ‌ర్లు)స్కోరుతో ఉన్న‌ప్పుడు వ‌ర్షం ప‌డింది. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంత‌రాయం క‌లిగింది. వ‌రుణుడు శాంతించ‌డంతో మ‌ళ్లీ ఆట ప్రారంభ‌మైంది. ఇక్క‌డే నార్త్ జోన్ దారుణంగా వ్య‌వ‌హ‌రించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ జ‌యంత్ యాద‌వ్ బంతి బంతికి ఫీల్డింగ్‌ను మారుస్తూ స‌మ‌యం వృథా చేసేందుకు శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నించాడు. వెలుతురు లేమీ, లేదా మ‌ళ్లీ వ‌ర్షం కార‌ణంగా ఆట నిలిచిపోయే అవ‌కాశం లేక‌పోలేద‌ని బావించి అలా చేశాడు.

Alex Carey : బార్బర్‌కు డ‌బ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీప‌ర్‌.. జూలై 10లోపు ఇవ్వ‌కుంటే..!

వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ డ్రా ముగిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన నార్త్ జోన్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకునే అవ‌కాశం ఉండేది. దీంతో కావాల‌నే అత‌డు స‌మ‌యాన్ని వృథా చేశాడు. అయిన‌ప్ప‌టికి సౌత్ జోన్ 36.1 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 219 ప‌రుగులు చేసి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. వ‌ర్షం అనంత‌రం 5.5 ఓవ‌ర్లు వేసేందుకు నార్త్ జోన్ ఏకంగా 53 నిమిషాలు తీసుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో సైతం వికెట్లు ప‌డిన‌ప్ప‌టికీ గంట‌కు దాదాపు 14 ఓవ‌ర్ల ఆట జ‌రుగుతుంది.

MS Dhoni Birthday Celebrations : మ‌నుషుల‌కు దూరంగా ధోని బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌.. వీడియో వైర‌ల్‌

5.5 ఓవ‌ర్లు వేసేందుకు 53 నిమిషాల స‌మ‌యం తీసుకోవ‌డం పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అంటూ ప‌లువురు ట్వీట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు