Costume Krishna : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

టాలీవుడ్ లో మరో మరణ వార్త అందర్నీ కలిచి వేస్తుంది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరికి సుపరిచితుడు అయిన కాస్ట్యూమ్ కృష్ణ (Costume Krishna) కన్నుమూశారు.

Costume Krishna : ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు అందర్నీ బాధిస్తున్నాయి. అలనాటి తారలు, దర్శకులు, టెక్నీషియన్స్ స్వర్గస్తులు అవుతూ టాలీవుడ్ ని దుఃఖ సంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఒక మరణ వార్త నుంచి కోలుకముందే మరొకరి మరణ వార్త వినాల్సి వస్తుంది. తాజాగా మరో సీనియర్ నటుడు మరియు టెక్నీషియన్ మరణ వార్త ఇండస్ట్రీని కలిచి వేస్తుంది. ఇండస్ట్రీలో అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా కెరీర్ మొదలు పెట్టి ‘కాస్ట్యూమ్ కృష్ణ’గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ కన్నుమూశారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే.. అవి అడిగి మరీ తింటారు.. త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్!

ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న కాస్ట్యూమ్ కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్న ఆయన చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని సినీ ప్రముఖులు అంతా దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఆయన మరణానికి చింతిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశాడు. కాస్ట్యూమ్ కృష్ణ గారి మరణ వార్త చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

Raviteja : క్రాక్ 2 వస్తుందంటూ క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని..

కాగా 1991 వరకు కృష్ణ.. కాస్ట్యూమర్ గా కెరీర్ సాగిస్తూ వచ్చారు. ఆ ఏడాది కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో పాటు అనేక సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా అనేక పాత్రలతో మెప్పించారు. అంతేకాదు జగపతిబాబు (Jagapathi Babu) హీరోగా తెరకెక్కిన పెళ్లిపందిరి సినిమాతో నిర్మాతగా కూడా మారారు. మొత్తం 8 సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు