Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న నెంబర్ వన్ టాక్ షో అన్‌స్టాపబుల్-2 వరుస ఎపిసోడ్లతో దూసుకుపోతుంది. ఇటీవల ఈ టాక్ షోకు పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రావడంతో అన్‌స్టాపబుల్-2 ఒక్కసారిగా ఎవరూ ఊహించని రేంజ్‌కు వెళ్లిపోయింది. ఇక ఈ టాక్ షోలో నెక్ట్స్ ఎపిసోడ్స్‌కు ఎవరు గెస్టులుగా వస్తారా.. వారు బాలయ్యతో ఎలాంటి సందడి చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు అన్‌స్టాపబుల్ నిర్వాహకులు. జనవరి 13న ప్రీమియర్ స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్‌కు బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ టీమ్ గెస్టులుగా రానున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ఆద్యంతం సందడిగా సాగింది. తన సినిమా టీమ్‌తో బాలయ్య ఓ రేంజ్లో సందడి చేశారు. దర్శకుడు బాబీ, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, అందాల భామ హనీ రోజ్‌లతో పాటు చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు.
Unstoppable 2: పండగపూట పవన్ అన్‌స్టాపబుల్ షో.. నిజమైన పండగ అంటోన్న అభిమానులు!
ఇక వారితో వీరసింహారెడ్డి సినిమా గురించి బాలయ్య ముచ్చట్లు సరదాగా ఉండబోతున్నాయని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడని.. ఆయన సినిమాలో ఏ విధంగా రెచ్చిపోనున్నాడా అని తామందరం కూడా ఆసక్తిగా చూస్తున్నామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఇక ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.