UPI 123Pay : మీ ఫోన్లలో ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా..!

UPI 123Pay : యూఐపీ పేమెంట్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆన్ లైన్ యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారా? ప్రస్తుతం ఏదైనా పేమెంట్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే.

UPI 123Pay : యూఐపీ పేమెంట్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆన్ లైన్ యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారా? ప్రస్తుతం ఏదైనా పేమెంట్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. లేదంటే ఆన్ లైన్ పేమెంట్స్ చేయడం కుదరదు. అయితే ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్ లైన్ లోనూ యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ అందరి యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI). నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో ఇటీవల 40 కోట్ల ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్బీఐ సులభతరం చేసింది.

ఇందుకోసం కొత్త UPI 123Pay అనే ఫీచర్ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ UPI 123Pay అనేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వీసు ద్వారా పనిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా డబ్బును బదిలీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో వివిధ పద్ధతులను ఉపయోగించి అనేక లావాదేవీలు చేయవచ్చు. NPCI అధికారిక సైట్ ప్రకారం.. IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్‌కు కాల్ చేయొచ్చు. ఫీచర్ ఫోన్‌లలో ఈ ఫీచర్ ఫంక్షనాల్టీ అందిస్తోంది. మిస్డ్ కాల్ ఆధారిత విధానంతో పాటు సౌండ్ ఆధారిత చెల్లింపులు కూడా ఇందులో ఉన్నాయి.

123Pay ఫీచర్ ద్వారా వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్‌ వంటి ఇతర యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ ద్వారా UPI అకౌంట్ బ్యాలెన్స్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం NPCI హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రకటించింది. రోజులో ఎప్పుడైనా కాల్ చేయడానికి ఉపయోగించవచ్చు. యూజర్లు డిజిటల్ చెల్లింపులు చేయడంతో పాటు ఇతర ప్రశ్నల కోసం చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం www.digisaathi.info అనే వెబ్‌సైట్ సందర్శించవచ్చు లేదా 14431, 1800 891 3333కు కాల్ చేయవచ్చు.

Upi 123pay Here’s How To Make Upi Payments Without Internet Connection

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా UPI పేమెంట్స్ ఇలా..
UPI పేమెంట్స్ చేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఈ కింది విధంగా మీరు ఫాలో అయితే చాలు.. ముందుగా IVR సర్వీసు ద్వారా అందుబాటులో ఉన్న UPI 123Pay ఫీచర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భద్రతా ప్రయోజనాల కోసం UPI పిన్‌ను కూడా సెట్ చేయవచ్చు.

1. ముందుగా, మీరు “08045163666” ఫోన్ నంబర్‌ను డయల్ చేయాలి. ఆ తర్వాత, UPI పేమెంట్ ప్రక్రియను సులభతరం చేసే భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది.
2. ఇప్పుడు, మీ ఫోన్ కీప్యాడ్‌లో ‘1’ నంబర్‌ను నొక్కండి. మీ డబ్బును ట్రాన్స్ ఫర్ చేయడానికి అనుమతిస్తుంది.
3. ఆ తర్వాత, UPIతో లింక్ అయిన బ్యాంక్‌ను ఎంచుకోవాలని అడుగుతుంది. మీ వివరాలను నిర్ధారించేందుకు మళ్లీ ఫోన్ కీప్యాడ్‌లో ‘1’ నంబర్‌ను నొక్కాలి.
4. నగదును బదిలీ చేసేందుకు.. మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. మీ వివరాలను నిర్ధారించేందుకు ‘1’పై మళ్లీ ప్రెస్ చేయండి.
5. మీరు ట్రాన్స్ ఫర్ చేయాలనుకున్న మొత్తం నగదును ఎంటర్ చేయండి. యూపీఐ పేమెంట్స్ కోసం సెట్ చేసిన UPI పిన్‌ను ఎంటర్ చేయండి.

అంతే.. సింపుల్.. మీ యూపీఐ పేమెంట్స్ పూర్తి అయినట్టే. మీరు ఎంపిక చేసిన బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి..

Read Also : Tata UPI App : గూగుల్‌ పే, ఫోన్‌పేకు పోటీగా.. టాటా యూపీఐ యాప్ వచ్చేస్తోంది..!

ట్రెండింగ్ వార్తలు