Satiish Raaj : దర్శకుడిగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్..

పలువురు డాన్స్ మాస్టర్స్ దర్శకులుగా మారి మంచి సినిమాలు తీసి విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు ఈ బాటలోనే మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్ కూడా చేరబోతున్నారు

Satiish Raaj : సినీ పరిశ్రమలో చాలా మంది డాన్స్ కొరియోగ్రాఫర్ లు దర్శకులుగా మారారు. ప్రభుదేవా, లారెన్స్, విజయ్ బిన్నీ, గణేష్ మాస్టర్.. ఇలా పలువురు డాన్స్ మాస్టర్స్ దర్శకులుగా మారి మంచి సినిమాలు తీసి విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు ఈ బాటలోనే మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్ కూడా చేరబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్ దర్శకుడిగా, నిర్మాతగా మారుతూ తన సొంత బ్యానర్ ని స్థాపించారు.

ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించగా ఈవెంట్ కు మురళి మోహన్, శేఖర్ మాస్టర్, విజయ్ బిన్నీ, వినోద్ బాల, కాదంబరి కిరణ్.. పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిధులుగా వచ్చారు. కొరియోగ్రాఫర్ సతీష్ తన సొంత బ్యానర్ ‘సతీష్ రాజ్ మూవీ జంక్షన్’ పేరుతో స్థాపించగా ఈ బ్యానర్ లోగోను మురళి మోహన్ ఆవిష్కరించారు. అలాగే సతీష్ రాజ్ సాయి బాబా భక్తుడు కావడంతో తన మొదటి సినిమాను సాయిబాబాకు అంకితం ఇవ్వాలని శ్రద్ధ సబూరి పేరుతో ఓ పాటను రూపొందించారు. ఈ పాటను శేఖర్ మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు.

Also Read : Vijay Deverakonda : వైజాగ్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన విజయ్ దేవరకొండ.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ.. ఒక దర్శకుడు సినిమా మొత్తాన్ని మూడు గంటల్లో చూపిస్తే కేవలం కొరియోగ్రాఫర్ మూడు నిమిషాల్లో కథ మొత్తం అర్థమయ్యేలా ఒక్క పాటలో చూపిస్తాడు. సతీష్ రాజ్ లాంటి మంచి కొరియోగ్రాఫర్లు దర్శకుడిగా మారడం వల్ల మంచి సినిమాలు వస్తాయి. సినిమా ప్రారంభించే ముందు సాయిబాబాకు పాటను అంకితం ఇవ్వడం చాలా బాగుంది అని అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. సతీష్ రాజ్ మాస్టర్ దర్శకుడిగా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయిన సతీష్ రాజ్ డైరెక్టర్ గా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. కొరియోగ్రాఫర్, డైరెక్టర్ విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. సతీష్ రాజ్ తో నాకు చాలా ఏళ్ళ అనుబంధం ఉంది. ఇప్పుడు సతీష్ డైరెక్టర్ గా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. త్వరలోనే సతీష్ రాజ్ సినిమా వర్క్స్ మొదలవుతాయని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు