Ilaiyaraaja : ‘ఇళయరాజా’కు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? తీవ్ర విమర్శలు చేస్తున్న సంగీత ప్రేమికులు..

సంగీత ప్రేమికులు ఆయన్ను ఆరాధ్య దైవంలా ఆరాధిస్తారు. కానీ ఇప్పుడు అదే సంగీత ప్రేమికులు ఇళయరాజాపై విమర్శలు చేస్తున్నారు.

Ilaiyaraaja : సంగీత ప్రపంచంలో మహారాజుగా ఎదిగారు ఇళయరాజా. తన పాటలతో, తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపించారు. ఎలాంటి సమయంలో అయినా, ఎలాంటి మూడ్ లో ఉన్నా రీఫ్రెష్ అవ్వడానికి ఇళయారాజా పాటలు వింటూనే ఉంటారు జనాలు. ఇప్పటికి ఇళయరాజా పాటలు రోజూ ఎక్కడో ఒకచోట మోగుతూనే ఉంటాయి. సంగీత ప్రేమికులు ఆయన్ను ఆరాధ్య దైవంలా ఆరాధిస్తారు. కానీ ఇప్పుడు అదే సంగీత ప్రేమికులు ఇళయరాజాపై విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల ఇళయరాజా చేసే పనులతో నెటిజన్లు, సంగీత ప్రేమికులు విమర్శలు చేస్తుంటే ఆయన పాటలు పాడాలన్నా, సినిమాల్లో వాడాలన్నా సినీ పరిశ్రమ వాళ్ళు భయపడుతున్నారు. ఇళయారాజా మీద, ఆయన పాటల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఇళయరాజా పాటపెడితే సన్నివేశానికి సూట్ అవుతుందనో, మైలేజ్ వస్తుందనో పలువురు తమ సినిమాల్లో ఇళయరాజా పాటలు పెట్టుకున్న వాళ్లు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తుంది. తిరిగేలా చేస్తున్నారు ఇళయరాజా.

Also Read : Vijay Deverakonda : వైజాగ్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన విజయ్ దేవరకొండ.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

మ్యూజిక్ మ్యాస్ట్రో, మ్యూజిక్ లవర్స్ డెమీ గాడ్ అని పిలుచుకునే ఇళయారాజా ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. వాళ్లూ వీళ్లూ అన్నతేడా లేకుండా తన పాట వాడుకున్న వాళ్లందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఇటీవల మళయాళంలో భారీ హిట్ కొట్టి 200 కోట్లు సాధించిన మంజుమ్మెల్ బాయ్స్ కి కూడా ఆ సినిమాలో తన గుణ సినిమా కమ్మని ఈ ప్రేమలేఖ .. సాంగ్ నా పర్మిషన్ లేకుండా వాడుకున్నారని లీగల్ నోటీసులిచ్చారు. తనకు డబ్బులు ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులు పంపించారు.

ఇళయరాజా నోటీసులివ్వడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. తన పాటల విషయంలో అసలు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇళయరాజా సహించరు. తనకి బాగా క్లోజ్ అయిన బాలసుబ్రహ్మణ్యం, రజనీకాంత్ తో సహా చాలా మందికి నోటీసులు పంపించారు. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో నా పాటలు, సంగీతం వాడుతున్నాడని గట్టిగానే స్పందించి నోటీసులు ఇచ్చాడు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిర్మాతలు, మ్యూజిక్ సంస్థలు ఆల్రెడీ పాటల రైట్స్ కొనుక్కున్నా ఆ రైట్స్ సంగీత దర్శకులకు, సింగర్స్ కు ఎలా ఉంటాయి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కొంతమంది మ్యూజిక్ సంస్థలకు డబ్బులిచ్చి ఆ పాటలు రైట్స్ కొనుక్కునా ఇళయరాజా నోటీసులు పంపించడంతో షాక్ అవుతున్నారు. ఇళయరాజా నాకు అదేం తెలీదు నా పాట వాడితే నాకు డబ్బులివ్వాల్సిందే అంటున్నారు. పలువురు నెటిజన్లు.. ఈ వయసులో డబ్బు ఏం చేసుకుంటారు? అయినా బాగానే డబ్బు సంపాదించారు, ఇలా చేసి ఉన్న మంచి పేరు ఎందుకు చెడగొట్టుకుంటారు అని విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంజుమ్మెల్ బాయ్స్ కి నోటీసులు పంపడంతో సోషల్ మీడియాలో తెలుగు, తమిళ, మలయాళ మీమ్ పేజీలు అన్ని ఇళయరాజాని ట్రోల్స్ చేస్తున్నాయి. ఇక కొంతమంది అయితే కనీసం మీ పాటలు వినొచ్చా అని కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read : Ananya Nagalla : ఓ రేంజ్‌లో కర్రసాము చేస్తున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్..

అసలు సంగీత ప్రపంచంలో మహరాజులా సంగీతంతో మంచి పేరు తెచ్చుకున్న ఇళయరాజా గత కొన్నాళ్లుగా ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు ఇళయరాజాకు ఏమైంది? ఆల్రెడీ తన పాటలు కొనుక్కున్న మ్యూజిక్ సంస్థలకు డబ్బులు చెల్లించినా ఇళయరాజా ఎందుకు నోటీసులు పంపిస్తున్నాడు? ఇళయరాజాకు ఎవ్వరూ చెప్పట్లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఇళయరాజా ఈ వివాదాలు, విమర్శలకు ఎప్పటికి ముగింపు ఇస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు