Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున టీజర్‌కి టైం లాక్ చేసిన ఏజెంట్.. గెట్ రెడీ..!

వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున మూవీ నుంచి ఇటీవల ప్రీ టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుల్ టీజర్ కి టైం లాక్ చేశారు.

Varun Tej Gandeevadhari Arjuna teaser release date announce

Gandeevadhari Arjuna : ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఇప్పటి వరకు ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ తో అలరించిన ఇప్పుడు ఫుల్ యాక్షన్ మోడ్ లోకి దిగబోతున్నాడు. జేమ్స్ బాండ్ తరహాలో ఈ మూవీ ఉండబోతుంది. ఈ సినిమాలో వరుణ్ స్పైగా అదిరిపోయే యాక్షన్ స్టంట్స్ చేసి అదరగొట్టబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రీ టీజర్ ఆడియన్స్ లో సినిమా పై మంచి హైప్ ని క్రియేట్ చేసింది.

Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్‌ని రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని ఉంది..

ఇప్పుడు ఫుల్ టీజర్ ని రిలీజ్ చేయడానికి వరుణ్ తేజ్ టైం ని ఫిక్స్ చేశాడు. జులై 24 ఉదయం 10:08 నిమిషాలకు ఈ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ప్రీ టీజర్ లోనే హాలీవుడ్ రేంజ్ కార్ అండ్ బైక్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ చూపించి మూవీలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒక చిన్న హింట్ ఇచ్చారు. ప్రీ టీజర్ చూసి వరుణ్ కట్ అవుట్ కి పర్ఫెక్ట్ సినిమా పడింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేశారు. మరి ఇప్పుడు ఫుల్ టీజర్ తో ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తారు చూడాలి.

Project K : ప్రభాస్‌ ఫస్ట్ లుక్ ఫ్యాన్ మేడ్ అంటూ కామెంట్స్.. ఐరన్ మ్యాన్ సూట్‌కి ప్రభాస్ హెడ్..

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుంది. విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే, వరుణ్ తన తదుపరి 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా రాబోతున్న ఈ మూవీలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు