VD13 : అమెరికాలో మొదలు కానున్న విజయ్ దేవరకొండ మూవీ.. లొకేషన్స్ ఫైనల్ అయ్యాయి..

విజయ్ దేవరకొండ, పరశురామ్ VD13 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికాలో ఈ మూవీ..

Vijay Devarakonda VD13 pre production works are in full swing

VD13 : విజయ దేవరకొండ (Vijay Devarakonda) చేతిలో ప్రస్తుతం ఖుషి, VD12, VD13 సినిమాలు ఉన్నాయి. వీటిలో ఖుషీ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేశాడు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇటీవలే VD12 షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ మూవీతో పాటు VD13 షూట్ కూడా జరుపుకోనుంది. పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Mega Heroes : ఆగష్టులో మెగా హీరోల సినిమా కార్నివాల్.. పవన్ అండ్ సాయి ధరమ్..

గతంలో విజయ్ అండ్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గీతగోవిందం’ ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో మూవీ వస్తుంది అంటే ప్రకటనతోనే అంచనాలు మొదలు అయ్యాయి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ టీం.. ఇటీవల లొకేషన్స్ కోసం అమెరికా వెళ్లారు. తాజాగా అక్కడ లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించబోతోన్నామని మేకర్స్ తెలియజేస్తూ అమెరికాలోని చిత్ర యూనిట్ ఫోటోని షేర్ చేశారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుంది. గీత గోవిందంకి సంగీతం అందించిన గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.

కాగా లైగర్ మూవీ ప్లాప్ విజయ్ ఫ్యాన్స్ ని చాలా బాధ పెట్టింది. ఆ తరువాత రావాల్సిన ఖుషి మూవీ బాగా లేటు అవ్వడంతో మరింత నిరాశకి గురి చేసింది. మరి ఈ సినిమాలతో విజయ్ ఫ్యాన్స్ ని ఎంత వరకు సంతృప్తిపర్చగలడో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు