Virat Kohli : ధోని ని అధిగ‌మించిన కోహ్లి.. స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC) 2023-2025 సైకిల్‌ను భార‌త్ గొప్ప‌గా ఆరంభించింది. ఈ క్ర‌మంలో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Virat Kohli Eyes on Sachin Tendulkars Massive Record

Virat Kohli Surpasses MS Dhoni : వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌ను టీమ్ఇండియా విజ‌యంతో ఆరంభించిన సంగ‌తి తెలిసిందే. బ్యాటింగ్‌లో య‌శ‌స్వి జైశ్వాల్ (Yashasvi Jaiswal) భారీ శ‌త‌కం, బౌలింగ్‌లో అశ్విన్ (Ashwin) మాయాజాలం చేయ‌డంతో తొలి టెస్టులో విండీస్‌(West Indies)ను ఇన్నింగ్స్ 141 ప‌రుగుల తేడాతో భార‌త్ చిత్తు చేసింది. త‌ద్వారా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC) 2023-2025 సైకిల్‌ను గొప్ప‌గా ఆరంభించింది. ఈ క్ర‌మంలో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Rohit Sharma : అత‌డి కోసం ఇన్నింగ్స్ డిక్లేర్ ఆల‌స్యం.. ఇంత‌కీ ఎవ‌రా ప్లేయ‌ర్ అంటే..?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni)ని అధిగ‌మించాడు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్‌(Sachin Tendulkar) రికార్డుపై విరాట్ క‌న్నేశాడు. డొమినికా లాంటి క‌ఠినమైన వికెట్‌పై విరాట్ కోహ్లి 76 ప‌రుగుల‌తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాదించ‌డంతో విరాట్ ఆడిన మ్యాచుల్లో టీమ్ఇండియా 296 సార్లు గెలుపొందింది. ఈ క్ర‌మంలోనే ధోని 295 విజ‌యాల రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. స‌చిన్ ఆడిన మ్యాచుల్లో భార‌త జ‌ట్టు 307 సార్లు గెలుపొందింది.

Asian Games : ఆసియా క్రీడ‌లు.. కెప్టెన్‌గా రుతురాజ్‌.. జైశ్వాల్‌, రింకుసింగ్‌ల‌కు చోటు.. తెలుగ‌మ్మాయిలు అంజ‌లి, అనూష‌ల‌కు స్థానం

ఏ ఆట‌గాడు ఎన్ని విజ‌యాల్లో పాలుపంచుకున్నాడంటే

* సచిన్ టెండూల్కర్ – 307
* విరాట్ కోహ్లీ – 296
* ఎంఎస్ ధోని – 295
* రోహిత్ శర్మ – 277
* యువరాజ్ సింగ్ – 227
* రాహుల్ ద్రవిడ్ – 216

500వ మ్యాచ్‌..

విండీస్ జ‌ట్టుతో ఈ నెల 20 న ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకోనున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లికి ఇది 500వ మ్యాచ్‌. ప్ర‌పంచ క్రికెట్‌లో అతి కొద్ది మంది మాత్ర‌మే ఈ మైలురాయిని అందుకున్నారు. రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ బ‌రిలోకి దిగితే ఈ మైలురాయిని అందుకున్న 10వ ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు.

India Tour of South Africa : టీమ్ ఇండియా సౌతాఫ్రికా టూర్.. షెడ్యూల్ విడుద‌ల‌

500 కు పైగా అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్ల జాబితా ఇదే..

– సచిన్‌ టెండూల్కర్‌ 664 మ్యాచ్‌లు
– మ‌హేలా జయవర్ధనే 652,
– కుమార సంగక్కర 594,
– స‌న‌త్ జయసూర్య 586,
– రికీ పాంటింగ్‌ 560,
– మ‌హేంద్ర సింగ్ ధోని 538,
– షాహిద్‌ అఫ్రిది 524,
– జాక్‌ కలిస్‌ 519,
– రాహుల్‌ ద్రవిడ్‌ 509

Rohit Sharma : వెస్టిండీస్‌పై శ‌త‌కం.. ప‌లు రికార్డుల‌ను అందుకున్న రోహిత్ శ‌ర్మ‌.. అవేంటో తెలుసా..?

ఈ జాబితాలో కోహ్లి స్థానం ద‌క్కించుకోనున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లి అన్ని ఫార్మాట్ల‌ల‌లో క‌లిపి 499 మ్యాచ్‌లు ఆడాడు. 25,461 ప‌రుగులు చేశాడు. ఇందులో 75 సెంచ‌రీలు ఉన్నాయి. ఈ జాబితాలో సచిన్‌ 664 మ్యాచ్‌ల్లో 100 శ‌త‌కాల‌ సాయంతో 34,357 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు