Bigg Boss 5 : బిగ్ బాస్ 5 సీజన్ లో కొత్త కొత్త టాస్కులు ఇస్తున్నారు. టాస్క్ లో భాగంగా ఇంకో టాస్కులు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చాడు. రెండు రోజులుగా ఆ టాస్క్ కొనసాగుతుంది. ఇందులో అందరూ ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా విశ్వకు స్పెషల్ పవర్ ఉన్న ఒక ఎల్లో గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను ఈజీ గా పొందే అవకాశం లభించింది. కానీ ఆ అయిదు గుడ్లని పొందాలంటే ఇంకో టాస్క్ చేయాలన్నారు బిగ్ బాస్.
Samantha : సమంత ధాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ విచారించనున్న కోర్టు…
ఆ అయిదు గుడ్ల కోసం ఎక్కువ దుస్తులు ధరించాలనే ఒక టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే విశ్వతో పాటు విశ్వ ఇంకొకరిని ఎంచుకోవాలి ఈ టాస్క్ ఆడేందుకు. దీంతో విశ్వ తనకి పోటీగా ఈ టాస్క్ ఆడేందుకు కాజల్‌ని ఎన్నుకున్నాడు. విశ్వ, కాజల్ ఇద్దరు పోటా పోటీన దుస్తులు ధరించారు. ఈ టాస్క్‌లో సన్నీ.. కాజల్‌కి హెల్ప్ చేశాడు. కాజల్ ఎక్కువ దుస్తులు వేసుకోవాలని సన్నీ ఇంటి సభ్యుల దుస్తులను కూడా పట్టుకొచ్చాడు. కానీ ఈ టాస్క్‌లో మొత్తంగా విశ్వ 106 దుస్తులు ధరిస్తే కాజల్ 79 దుస్తులు ధరించింది. టాస్క్ గెలిచి అయిదు గుడ్లని గెలుచుకున్నాడు విశ్వ. ఆ తర్వాత దుస్తులు తొలగించే క్రమంలో విశ్వ తన ఒంటి పై ఉన్న నిక్కరు తప్ప అన్ని విప్పేశాడు. దీంతో ప్రియా అది ఎందుకు ఉంచావు. అది కూడా తీసేయ్ అని అనడంతో ఇంటి సభ్యులంతా నవ్వేశారు.