Maha Dharna: కేంద్రంపై యుద్ధం.. ఇందిరాపార్క్‌లో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా నేడే!

వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మహా ధర్నాకు చేస్తోంది.

Maha Dharna: వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మహా ధర్నాకు చేస్తోంది. ఇందిరాపార్క్‌ వేదికగా మహా ధర్నా కోసం భారీ ఏర్పాట్లు చేశారు ఆ పార్టీవాళ్లు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, సహకార బ్యాంక్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు.

ఇవాళ(18 నవంబర్ 2021) ఉదయం 11 గంటలకు మహాధర్నా ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం రెండు గంటలవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు మెమొరాండం సమర్పిస్తారు. మహా ధర్నాకు ఒకరోజు ముందు ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని కోరారు.

Ameerpet: అమీర్‌పేటలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. నమ్మన స్నేహితుడినే లక్షల్లో మోసం చేశాడు

2020-21 ఎండాకాలం సీజన్లో సేకరించని 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలన్నారు. 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్న నిబంధన మరింతగా పెంచి, పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా వానాకాలం పంటలో 90శాతం వరిని సేకరించాలన్నారు. వచ్చే యాసంగిలో తెలంగాణ నుంచి కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్ధారించాలని లేఖలో కోరారు.
.
మరోవైపు మహా ధర్నా తర్వాత కేంద్రం నుంచి స్పందన కోసం రెండ్రోజులు ఎదురు చూస్తామని.. అప్పటికీ కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే బీజేపీని వెంటాడుతూనే ఉంటామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు