Kamal Nath: 82% హిందువులున్నారు, ఇది హిందూ దేశమే.. కాంగ్రెస్ నేత కమల్‭నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఛింద్వారాలో బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని స్వాగతించారు కమలనాథ్. అయితే దీనిపై సొంత కూటమి నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు

Madhya Pradesh: దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేస్తామంటూ కొందరు రైట్ వింగ్ నేతలు చేసే వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తరుచూ విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రధాని ప్రతిపక్షమై కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ విమర్శలు వస్తుంటాయి. అధికార పార్టీ మెజారిటీ హిందువుల పక్షమని చెప్తున్న నేపథ్యంలో తాము అన్ని మతాలను గౌరవిస్తామని, తమది సెక్యూలర్ పార్టీయని కాంగ్రెస్ నేతలు అంటుంటారు. అయితే ఉన్నట్టుండి ‘‘ఈ దేశం ఆల్రెడీ హిందూ రాష్ట్రమే’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‭నాథ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

2024 Elections: కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్.. కస్సుమన్న కాంగ్రెస్

దీనికి ఆయన చెప్పిన లాజిక్.. దేశంలో 82% మంది హిందువులు ఉన్నారని, అందువల్ల భారతదేశం ఇప్పటికే హిందూ రాష్ట్రమని అన్నారు. హిందూ రాష్ట్రం చేయాలంటూ స్వయం ప్రకటిత దైవదూత ధీరేంద్ర శాస్త్రి డిమాండుకు అనుకూలంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తానికి తాజాగా ధీరేంద్ర శాస్త్రిని ఆహ్వానించి ఆయనకు సన్మానం చేశారు కమలనాథ్. ఆ సందర్భంగానే ఈ తాజా ప్రకటన వచ్చింది.

Rahul Gandhi: 3 నెలల ఏ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడో.. అదే ఇంటికి ఎంపీగా తిరిగొచ్చిన రాహుల్ గాంధీ

ఛింద్వారాలో బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని స్వాగతించారు కమలనాథ్. అయితే దీనిపై సొంత కూటమి నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ నకుల్ కమల్ నాథ్ చింద్వారాలో ధీరేంద్ర శాస్త్రికి ఆతిథ్యం ఇస్తున్నారని విమర్శించారు. బాగేశ్వర్ ధామ్ చీఫ్ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని బహిరంగంగా వాదించారని, అలాంటి వారికి సన్మానాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మన దేశం రాజ్యాంగం ద్వారానే పాలించబడుతుంది తప్ప మరే ఇతర భావజాలం కాదని తివారీ అన్నారు. అయితే దీనిపై కమల్‭నాథ్‭ను ప్రశ్నించగా.. ‘‘దేశంలో 82 శాతం హిందువులున్నారని డేటా చెప్తోంది. ఆల్రెడీ ఇది హిందూ రాష్ట్రమే. మళ్లీ దీనిపై చర్చ అనవసరం’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు