Shankar Mishra: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో కొత్త కోణం

కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవడంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలకు గురవుతోంది.

Shankar Mishra: ఎయిర్ ఇండియా విమానంలో ఒక మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి, కోర్టు విచారణ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వాస్తవానికి తాను ఎవరిపై మూత్ర విసర్జన చేయలేదని, ఆ మహిళే తన సీటులో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ కోర్టు ముందు శుక్రవారం వెల్లడించాడు. తన పక్కనే ఉన్న వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని కోర్టు వెల్లడించాడు.

Rapido Bike Taxi: ర్యాపిడోకు షాకిచ్చిన బాంబే హైకోర్టు.. సర్వీసులన్నీ వెంటనే నిలిపివేతకు ఆదేశాలు

అతడిని విచారించేందుకు ఢిల్లీ పోలీసులకు సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చిన అనంతరం శంకర్ మిశ్రా నుంచి ఇలాంటి స్పందన రావడం ఆసక్తికరంగా మారింది. 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‭కు పంపుతూ శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి అతడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అంతే కాకుండా, బెయిల్ కోసం శంకర్ మిశ్రా చేసుకున్న దరఖాస్తును సైతం కోర్టు తోసిపుచ్చింది. మిశ్రా చేసిన చర్య చాలా క్రూరమైదనదని ధర్మాసనం పేర్కొంది.

Kiren Rijiju: బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేతకు భంగపాటు.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవడంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఢిల్లీలో విమానం దిగగానే మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విమానాశ్రయం నుంచి అతడు దర్జాగా వెళ్లిపోయాడు. కాగా ఈ విషయమై జనవరి 4న పోలీసులకు ఎయిర్‌లైన్స్ ఫిర్యాదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు