Woman Police Inspector: చెన్నై వరదల్లో మహిళా ఎస్సై.. స్పృహ కోల్పోయిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్తూ..

స్పృహ కోల్పోయి పడి ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఆ మహిళా ఎస్సై చేసిన పనికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. టీపీ చత్రమ్ ఏరియాలో స్పృహ లేని వ్యక్తిని తన భుజాలపై మోసుకెళ్లింది.

Woman Police Inspector: స్పృహ కోల్పోయి పడి ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఆ మహిళా ఎస్సై చేసిన పనికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చెన్నై లోని టీపీ చత్రమ్ ఏరియాలో స్పృహ లేని వ్యక్తిని తన భుజాలపై మోసుకెళ్లింది. అక్కడే ఉన్న ఆటో ఎక్కించి దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఆమె చేసిన ఈ నిస్వార్థమైన చర్యకు నెట్టింట వెల్లువలా కురుస్తున్నాయి అభినందనలు.

కింద పడి ఉన్న 28ఏళ్ల వ్యక్తిని మహిళా ఎస్సై స్వయంగా మోసుకెళ్లి సాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలా జరిగి ఉండొచ్చు. ఎగ్మోర్, పెరంబూర్ ప్రాంతాల్లో పెద్ద చెట్లు కూడా నేలకూలాయి. రెవెన్యూ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కుమార్ జయంత్.. వర్షాల కారణంగా శనివారం నుంచి 12మంది వరకూ మృత్యువాత పడ్డారని చెబుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో గురువారం సాయంత్రం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు సూచించారు.

…………………………………….: స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఎస్ఈసీ తీరును తప్పుబట్టిన ఏపీ హైకోర్టు

ట్రెండింగ్ వార్తలు